E-Paper
Advertisement

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు.. గొప్ప అవకాశం అంటూ చిరు పోస్ట్!

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు.. గొప్ప అవకాశం అంటూ చిరు పోస్ట్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక తన తమ్ముడు నాగబాబుకు అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. చిరంజీవి సోదరుడు నాగబాబు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదేవిధంగా రాజకీయాలలోకి వెళ్లి ప్రజాసేవ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ(Janasena) వ్యవహారాలను చూసుకుంటూ నాగబాబు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయనకు జనసేన పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలను అప్పగించారు.

నాగబాబుకు చిరంజీవి అభినందనలు..

ఇకపోతే తాజాగా ఏపీ ప్రభుత్వం నాగబాబుకు ఏపీ కేబినెట్ లో హోదా కల్పించిన సంగతి తెలిసిందే. నాగబాబు AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా నాగబాబు మంగళగిరిలోని అరణ్య భవన్ లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెళ్లవెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా సోదరుడు నాగబాబుకు అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ప్రకృతి ఇచ్చిన అవకాశం..

Advertisement

ఈ నేపథ్యంలోనే నాగబాబు చేసిన పోస్టును చిరంజీవి రీ పోస్ట్ చేస్తూ AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు ప్రియమైన సోదరుడు నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, మదర్ నేచర్ నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి గొప్ప బాధ్యతలను చేపట్టి మెరుగైన, పచ్చని ఆంధ్రపదేశ్ కు సహకరించడం గర్వించదగిన ముఖ్యమైన బాధ్యత ఈ కొత్త ప్రయాణంలో మరెన్నో గొప్ప విజయాలను సాధించాలని, ప్రజా సేవలో మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి తన సోదరుడు నాగబాబు చేపట్టిన కీలక బాధ్యతల పట్ల స్పందిస్తూ అభినందనలు తెలియజేశారు.

Advertisement

ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు కూడా నాగబాబుకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగబాబు ఇదివరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే నటుడిగా కూడా కొనసాగారు. ఇలా ఒకవైపు తన నటన ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో భాగమయ్యారు. ఇదివరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన నాగబాబు ప్రస్తుతం మరిన్ని అదనపు బాధ్యతలను తీసుకున్నారని చెప్పాలి. ఇక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం ఏదైనా బాబి డైరెక్షన్లో తెరకెక్కుతున్న కాక సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమైనట్టు మేకర్స్ తెలియజేశారు.

Also Read: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. కింగ్ 100 నుంచి బిగ్ అప్డేట్..వీడియో వైరల్!

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×