E-Paper
Advertisement

ఇంటర్వ్యూను మధ్యలో ఆపేస్తే మర్డర్… మైండ్ బెండింగ్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

ఇంటర్వ్యూను మధ్యలో ఆపేస్తే మర్డర్… మైండ్ బెండింగ్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Korean Thriller OTT : ఒక హోటల్ రూమ్… ఇద్దరు వ్యక్తులు… ఒక్క ఇంటర్వ్యూ… కానీ ఇది సాధారణ ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ ప్రశ్నలు అడిగేవాడు హంతకుడు, సమాధానాలు చెప్పేది రిపోర్టర్. ఇలాంటి మెంటలెక్కించే ట్విస్ట్‌ తో మొదలై, మనసును కలచిచేసే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మారే చిత్రం ‘మర్డర్ రిపోర్ట్’ (Murder Report). పైగా ఇదొక కొరియన్ థ్రిల్లర్ కావడం విశేషం. మరి సైకో థ్రిల్లర్ మూవీ లవర్స్ ఐ ఫీస్ట్ లాంటి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ప్రముఖ సీనియర్ రిపోర్టర్ బేక్ సన్-జూ (Cho Yeo-jeong). ఆమెకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎదుటి వ్యక్తి తాను సీరియల్ కిల్లర్ అని, ఇప్పటికే 11 మందిని దారుణంగా హత్య చేశానని చెబుతాడు. తన కథ పూర్తి ఎక్స్‌క్లూసివ్‌ గా ఇవ్వడానికి సిద్ధమని అంటాడు. కానీ ఈ బంపర్ ఆఫర్ కావాలంటే ఒక షరతు పెడతాడు. సన్-జూ ఒంటరిగా తాను చెప్పిన హోటల్ రూమ్‌కి రావాలి. అలా వస్తే తదుపరి బాధితుడు ఎవరో చెబుతానని, ఆ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇస్తానని అంటాడు.

Advertisement

కెరీర్లో ఎదగడానికి బిగ్ స్కోప్ కోసం ఎదురు చూస్తున్న సన్-జూ అతని కండిషన్ కు ఒప్పుకుంటుంది. భయం, బాధ్యతలతో ఆ రూమ్‌కి వెళ్తుంది. ఆమె భద్రత కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ హాన్ సాంగ్-వూ అదే హోటల్‌ లో వేరే రూమ్ తీసుకుని, రహస్య కెమెరాలు అమర్చి నిఘా పెడతాడు. కానీ ఆ రూమ్‌ లోకి అడుగు పెట్టిన తర్వాత కథ పూర్తిగా తలక్రిందులవుతుంది. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వ్యక్తి లీ యంగ్-హూన్ (Jung Sung-il) ఒక ప్రసిద్ధ సైకియాట్రిస్ట్.

అంటే అతను సాధారణ సీరియల్ కిల్లర్ కాదు, మేధావి, మాటలతోనే మనసు, మనుషులను మార్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. మొదట్లో ప్రశ్నలు అడిగేది సన్-జూ అయితే, క్రమంగా పాత్రలు మారిపోతాయి. యంగ్-హూన్ ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె కూతురు, ఆమె గతం, ఆమె కాంప్రమైజ్ అవ్వడం వంటివన్నీ ఒక్కొక్కటిగా తవ్వి తీస్తాడు. తన హత్యల వెనుక ఉన్న బాధాకరమైన గతాన్ని, తత్వశాస్త్రాన్ని చెప్పుతూ సన్-జూని ఇబ్బందుల్లో పడేస్తాడు. ఇంటర్వ్యూ ముగిసేసరికి ఎవరు వేటగాడు ? ఎవరు బాధితుడు ? అనేది చూసే ఆడియన్స్ కు డౌట్ కొడుతుంది. ఒక హంతకుడితో మాట్లాడటం ద్వారా రిపోర్టర్ తన సొంత నైతికతను, జీవితాన్ని ప్రశ్నించుకునే స్థాయికి వెళ్తుంది. మరి ఈ కిల్లర్ నుంచి హీరోయిన్ ఎలా బయట పడింది ? అసలు ఆ కిల్లర్ ఈ రిపోర్టర్ ను ఎందుకు టార్గెట్ చేశాడు ? ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ప్రస్తుతం JioHotstarలో హిందీ, తెలుగు లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×