E-Paper
Advertisement

చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ వచ్చాడు… అతని కోసం వచ్చిన కిల్లర్ ఎవరో తెలిస్తే షాక్

చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ వచ్చాడు… అతని కోసం వచ్చిన కిల్లర్ ఎవరో తెలిస్తే షాక్
Advertisement

Korean Spy Action Thriller: చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించి తొమ్మిదేళ్లుగా రహస్య జీవితం గడుపుతున్న ఓ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్… కానీ ఒకరోజు అతని కోసం వచ్చిన ప్రొఫెషనల్ కిల్లర్ ఎవరో తెలిసి షాక్ అవుతాడు. శత్రువు కాదు… తన సొంత కూతురే అతన్ని చంపడానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతుంటే, కూతురు మాత్రం అతడిని దేశద్రోహిగా భావించి వేటాడితే ? ఈ తండ్రీకూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ గేమ్‌, హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘బటర్‌ఫ్లై’ (Butterfly). మరి ఈ సిరీస్‌ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

డేవిడ్ జంగ్ ఒకప్పుడు అమెరికాకు చెందిన అత్యంత ప్రతిభావంతుడైన సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. తన గతానికి సంబంధించిన ఒక ప్రమాదకరమైన రహస్యాన్ని దాచుకోవడానికి తొమ్మిదేళ్ల క్రితం తాను చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మిస్తాడు. ఆ తర్వాత తన అసలు గుర్తింపును పూర్తిగా దాచుకుని దక్షిణ కొరియాలో ప్రశాంతమైన, రహస్య జీవితాన్ని గడుపుతుంటాడు. ప్రపంచం దృష్టిలో డేవిడ్ జంగ్ ఇక లేడు. కానీ అతని గతం మాత్రం అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది.

Advertisement

డేవిడ్ జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ‘కాడిస్’ అనే అంతర్జాతీయ స్పై ఆర్గనైజేషన్‌కు అతను ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. గతంలో డేవిడ్‌తో ఉన్న సంబంధాలు, అతని వద్ద ఉన్న రహస్య సమాచారం కారణంగా అతన్ని ఎలాగైనా అంతం చేయాలని ఆ సంస్థ నిర్ణయిస్తుంది. అయితే డేవిడ్‌ను చంపేందుకు పంపిన వ్యక్తి సాధారణ కిల్లర్ కాదు.

కాడిస్ అత్యంత ప్రమాదకరమైన ఒక ప్రొఫెషనల్ అసాసిన్‌ను రంగంలోకి దింపుతుంది. ఆమెను ఎదుర్కొన్న డేవిడ్‌కు ఒక్క క్షణంలో ప్రపంచమే తలకిందులైనంత షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే తనను చంపడానికి వచ్చిన ఆ కిల్లర్ మరెవరో కాదు… తన సొంత కూతురు రెబెక్కా. డేవిడ్ తొమ్మిదేళ్ల క్రితమే చనిపోయాడని నమ్మిన రెబెక్కా, అతడిని ఒక దేశద్రోహిగా భావిస్తుంది. కాడిస్ ఆమెను చిన్నప్పటి నుంచి ఒక కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా తీర్చిదిద్దడంతో, తన తండ్రిని చంపడమే తన బాధ్యత అని నమ్ముతుంది. మరోవైపు డేవిడ్ మాత్రం తన కూతురిని చంపడం కాదు, ఆమె నిజం తెలుసుకునేలా చేయాలని ప్రయత్నిస్తాడు.

Advertisement

ఇక్కడి నుంచే తండ్రీకూతుళ్ల మధ్య అసలు మైండ్ గేమ్ మొదలవుతుంది. ఒకవైపు కాడిస్ నుంచి తప్పించుకోవాలి, మరోవైపు తన ప్రాణాల కోసం వేటాడుతున్న కూతురి నుంచి బయటపడాలి. మరి కాడిస్ అసలు లక్ష్యం ఏంటి ? డేవిడ్ గతంలో దాచిన రహస్యం ఏమిటి ? రెబెక్కాను ఎవరు, ఎందుకు ఇంత ప్రమాదకరమైన హంతకురాలిగా మార్చారు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులోనూ చూడవచ్చు

డేనియల్ డే కిమ్, రీనా హార్డెస్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బటర్‌ఫ్లై’ సిరీస్‌కు మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. దక్షిణ కొరియాలోని సియోల్, బుసాన్, దేగు వంటి ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు హాలీవుడ్ మేకింగ్‌తో పాటు కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ టచ్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. సిరీస్ ఇంగ్షీషుతో పాటు తెలుగు, హిందీ, తమిళం ఆడియోల్లోనూ ఉంది. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌తో పాటు స్పై యాక్షన్, చేజింగ్, మైండ్ గేమ్స్ ఉండే సిరీస్ కోసం వెతుకుతుంటే ఈ సిరీస్ మంచి ఛాయిస్.

Read Also: దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×