E-Paper
Advertisement

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?
Advertisement

Spy Thriller on OTT: ఒకవైపు తన కెరీర్‌లో మళ్లీ పేరు తెచ్చుకోవాలనే తపనతో పనామాకు వచ్చిన బ్రిటిష్ గూఢచారి… మరోవైపు గతాన్ని దాచుకుని కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని ప్రయత్నిస్తున్న ఓ టైలర్. ఒకరి బలహీనత మరొకరికి ఆయుధంగా మారితే? నిజమైన రహస్యాలు తెలియకపోయినా… డబ్బు కోసం ఓ వ్యక్తి అబద్ధపు కథలు అల్లితే ? ఆ అబద్ధాలే ఏకంగా రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే ? చివరికి ఆ గూఢచారి గెలిచాడా ? లేక తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పిన టైలర్‌దే పైచేయి అయిందా ? ఇదే రాజకీయ కుట్రలు, గూఢచర్యం, బ్లాక్‌మెయిల్‌తో సాగిపోయే క్లాసిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘ది టైలర్ ఆఫ్ పనామా’ (The Tailor of Panama). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో చూడొచ్చు? తెలుగులో ఉందా? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పనామా దేశంలో కథ మొదలవుతుంది. పనామా కాలువపై అమెరికా నియంత్రణ ముగిసి, ఆ దేశానికి కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతున్న సమయం అది. పైకి చూస్తే ప్రశాంతంగా కనిపించే పనామాలో… లోపల మాత్రం రాజకీయాలు, డబ్బు, అధికార పోరాటాలు వేడెక్కుతుంటాయి. అలాంటి సమయంలో బ్రిటిష్ గూఢచారి ఆండీ ఓస్నార్డ్ పనామాకు వస్తాడు. కానీ అతను సాధారణ మిషన్‌పై వచ్చిన గూఢచారి కాదు. ఓ దౌత్యవేత్త భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అతని కెరీర్ దెబ్బతింటుంది. శిక్షగా అతడిని పనామాకు పంపిస్తారు. అక్కడ తన ప్రతిష్ఠను తిరిగి సంపాదించుకోవడానికి ఏదైనా పెద్ద సమాచారాన్ని బ్రిటన్‌కు అందించాలని ఓస్నార్డ్ చూస్తుంటాడు.

Advertisement

అదే సమయంలో అతని దృష్టి హ్యారీ పెండెల్ అనే ప్రముఖ టైలర్‌పై పడుతుంది. పనామాలోని రాజకీయ నాయకులు, ధనవంతులు, పెద్ద అధికారులు అందరికీ బట్టలు కుట్టే హ్యారీ బయటకు చూస్తే చాలా గౌరవంగా కనిపిస్తాడు. కానీ అతని గతంలో ఓ పెద్ద రహస్యం దాగి ఉంటుంది. తాను లండన్‌లోని గొప్ప కుటుంబానికి చెందిన వాడినని హ్యారీ అందరినీ నమ్మిస్తుంటాడు. కానీ నిజానికి అతను గతంలో జైలు శిక్ష అనుభవించిన మాజీ నేరస్థుడు. ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ భారీ అప్పుల్లో కూరుకుపోతుంటాడు. తన గతం బయటపడితే కుటుంబం, గౌరవం రెండూ పోతాయని భయపడుతుంటాడు.

హ్యారీ బలహీనతను ఓస్నార్డ్ కనిపెట్టేస్తాడు. అదే అతనికి కావాల్సిన ఆయుధంగా మారుతుంది. హ్యారీ గతాన్ని బయట పెట్టకుండా ఉండాలంటే… పనామాలోని తన క్లయింట్ల నుంచి రాజకీయ రహస్యాలు సేకరించి తనకు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. హ్యారీకి నిజమైన రాజకీయ రహస్యాలు ఏమీ తెలియవు. అయినా ఓస్నార్డ్‌కు సమాచారం ఇవ్వకపోతే తన గతం బయట పడుతుందని భయపడతాడు. దీంతో డబ్బు కోసం, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం… అతను తన ఊహతో కథలు అల్లడం మొదలుపెడతాడు.

Advertisement

తన భార్య లూయిసా పనామా కాలువ పరిపాలనకు సంబంధించిన కీలక వ్యక్తుల దగ్గర పని చేస్తుండటంతో, అక్కడి రాజకీయ పరిస్థితులపై హ్యారీకి కొంత అవగాహన ఉంటుంది. ఆ చిన్న సమాచారాన్ని తన ఊహతో కలిపి ఓస్నార్డ్‌కు పెద్ద పెద్ద రహస్యాలుగా చెప్పడం మొదలుపెడతాడు. పనామా ప్రభుత్వం కాలువను చైనాకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని… దానికి వ్యతిరేకంగా దేశంలో ఓ రహస్యమైన రాజకీయ ఉద్యమం నడుస్తోందని… దేశంలోని కీలక వ్యక్తులు పెద్ద కుట్రకు సిద్ధమవుతున్నారని హ్యారీ అబద్ధపు కథలు అల్లుతాడు. ఓస్నార్డ్‌కు కావాల్సింది కూడా ఇలాంటి సంచలన సమాచారమే. హ్యారీ చెప్పిన ప్రతి మాటను నిజమని నమ్మి బ్రిటిష్ అధికారులకు చేరవేస్తాడు. అక్కడితో ఆగకుండా ఆ సమాచారానికి మరింత ప్రాధాన్యత వచ్చేలా చేస్తాడు.

చూస్తుండగానే హ్యారీ చెప్పిన చిన్న అబద్ధం పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. బ్రిటన్, అమెరికా అధికారుల్లో ఆందోళన మొదలవుతుంది. పనామాలో ఏదో పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందనే అనుమానాలు పెరుగుతాయి. పరిస్థితి మరింత దిగజారితే సైనిక చర్యకు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంతవరకు డబ్బు కోసం చెప్పిన అబద్ధాలు… ఇప్పుడు వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే స్థాయికి చేరడంతో హ్యారీకి భయం మొదలవుతుంది. తాను సరదాగా అల్లిన కథలను నిజమైన రాజకీయ సమాచారంగా ప్రపంచం నమ్ముతోందని అతనికి అర్థమవుతుంది.

మరోవైపు ఓస్నార్డ్ మాత్రం ఈ గందరగోళాన్ని తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని చూస్తుంటాడు. హ్యారీకి నిజం చెప్పే ధైర్యం లేకపోవడం… ఓస్నార్డ్‌కు మరింత అవకాశం ఇస్తుంది. పరిస్థితులు చేయి దాటుతున్నా ఇద్దరూ తమ తమ ప్రయోజనాల కోసం ఆటను కొనసాగిస్తారు. చివరకు హ్యారీ తాను చెప్పిన అబద్ధాల వల్ల ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడిందో గ్రహిస్తాడు. ఇక నిజం బయటపెట్టకపోతే తన కుటుంబంతో పాటు ఎంతోమంది జీవితాలు ప్రమాదంలో పడతాయని తెలుసుకుంటాడు. దీంతో తాను చెప్పిన రాజకీయ కథలన్నీ కల్పితమేనని బయటపెట్టేందుకు సిద్ధమవుతాడు.

మరి అప్పటికే ఆ అబద్ధాలు ఎక్కడి వరకు వెళ్లాయి? హ్యారీ నిజం చెప్పడంతో అంతర్జాతీయ సంక్షోభం ఆగిందా? ఓస్నార్డ్ తన కుట్రలో విజయం సాధించాడా? చివరకు ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని అతను ఏం చేశాడు? తన భార్య, కుటుంబాన్ని కాపాడుకోవడానికి హ్యారీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అబద్ధాలతో మొదలైన ఈ గూఢచారి ఆట చివరకు ఎక్కడికి చేరింది? అనేదే ‘ది టైలర్ ఆఫ్ పనామా’లో చూడాల్సిన అసలు విషయం.

తెలుగు స్ట్రీమింగ్ అవుతోందా ?

‘ది టైలర్ ఆఫ్ పనామా’లో పియర్స్ బ్రాస్నన్, జియోఫ్రీ రష్, జేమీ లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్ లే కారే రాసిన నవల ఆధారంగా జాన్ బూర్‌మాన్ దర్శకత్వం వహించిన ఈ 2001 క్లాసిక్ స్పై థ్రిల్లర్‌లో డేనియల్ రాడ్‌క్లిఫ్ కూడా బాలనటుడిగా కనిపిస్తారు. ఈ సినిమా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. తెలుగులో మాత్రం లేదు.

Read Also: చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్

Tags

Related News

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

Big Stories

Advertisement
×