Tirumala Scam: తిరుమలలో భారీ దందాకు కొంత మంది కేటుగాళ్లు తెరలేపారు. నకిలీ ఆధార్ కార్డులతో వేరేవాల్ల రూములను మరో వ్యక్తులకు నకిలీ పత్రాలతో పొంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిన్న ఆగస్టు 16న ఓ గది పోందిని వ్యక్తి అదే గదిపై మరో వ్యక్తి మరో గుర్తింపు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ఓకే లైన్లో నిలబడుతూ ఉన్నారు. దీంతో అది గమనించిన సీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు విషయం బైటపడింది. విచారణలో భాగంగా కేరళ జిల్లాకు చెందిన ఆషిక్ అలీగా అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న రెండు నకిలీ ఆధార్ కార్డులుతో పాటు గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో రంజిత్ అనే దళారీకి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు పోలీసులు విచారనలో ఆషిక్ అనే వ్యక్తి తెలిపాడు. దీంతో నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొంది వాటిని దళారీకి అప్పగించడం తన పనిగా చేసుకుని వాటిని వచ్చే భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ దందాలో కొంత మంది వ్యక్తులుర ఉన్నట్టు పోలీసులు గుర్తించి మిగతా వ్యక్తులపై పోలీసులు విచారన చేపట్టారు. విచారణలో భాగంగా తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..!
తిరుమలకు వచ్చే భక్తులు దళారుల ద్వారా గదులు కొనుగోలు చేయవద్దని ఆధార్, ఫోటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అక్కడి వ్యక్తులకు ఎట్టిపరిస్ధితుల్లోను ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. భక్తుల వసతికోసం సీఆర్‌ఓ కౌంటర్లు, లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు భక్తులకు తెలిపారు.
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో ఇతరుల పేర్లపై గదులు పొంది, అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుమల భక్తులకు పోలీసులు అలర్ట్ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 9866898630, 155257కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Also Read: డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!