Kotthapallilo Okappudu OTT: కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాల ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రవీణ(Praveena) దర్శకురాలిగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు(Kotthapalliolo Okappudu). వృత్తిపరంగా డాక్టర్ అయిన ఈమె విదేశాలలో డాక్టర్ వృత్తిని నిర్వహిస్తూ ఉండేవారు అయితే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి నిర్మాతగా సక్సెస్ అందుకోవడమే కాకుండా దర్శకురాలిగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా జులై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది.
దేవుడంటే ఒక నమ్మకం..
ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవుడంటే నిజమో అబద్ధమో కాదు ఒక నమ్మకం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా థియేటర్లలో అనుకున్న స్థాయిలో అంచనాలను ఆకట్టుకోలేని నేపథ్యంలో ఈ సినిమాని తిరిగి ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఓటీటీ విడుదల(OTT Release) గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహా(Aha) కొనుగోలు చేశారు.
ఆగస్టు 22న ఓటీటీలోకి..
ఈ క్రమంలోనే థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకి తిరిగి ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతుందని అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాని థియేటర్లో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో ఆగస్టు 22వ తేదీ చూడవచ్చు. ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే… రామకృష్ణ (మనోజ్ చంద్ర) ఇంటర్ వరకు చదువుకొని కొత్తపల్లి అనే గ్రామంలో అందరికీ వడ్డీలకు డబ్బులు ఇచ్చే అప్పన్న (రవీంద్ర విజయ్) అనే వ్యక్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేకంగా రికార్డింగ్ డాన్స్ స్టూడియో కూడా ఉంటుంది.
Kothapalli పిలుస్తోంది! 🎬
Watch #KothapalliloOkappudu Premieres 22nd Aug only on #aha
(24hrs early access for Gold users)@RanaDaggubati @IamPraveenaP @SpiritMediaIN#KothapalliloOkappudu #RanaDaggubati #PraveenaParuchuri pic.twitter.com/IO08xuWGba— ahavideoin (@ahavideoIN) August 8, 2025
ఆ ఊరి పెద్ద మనవరాలు సావిత్రి (మౌనిక) అంటే రామకృష్ణకు ఎంతో ఇష్టం. ఇక తామిద్దరిని కలపాలి అంటూ రామకృష్ణ సావిత్రి స్నేహితురాలు సహాయం కోరుతాడు. ఇదే విషయం గురించి ఒక గ్రామంలోని ఒక గడ్డివాము దగ్గర మాట్లాడుతుండగా అది చూసిన గ్రామస్తులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది మరి రామకృష్ణ అందం అలియాస్ ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నారా? తన ప్రేమ గురించి సావిత్రికి తెలియ చేశారా? చివరికి వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? రామకృష్ణకు ఈ విషయంలో ఎవరు సహాయం చేస్తారనే విషయాలు తెలియాలి అంటే మనం ఈ సినిమా చూడాల్సిందే. జులై 18న విడుదలైన ఈ సినిమా థియేటర్లో మెప్పించలేకపోయింది. ఆగస్టు 22వ తేదీ ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Actor Satya Dev: మూడ్ సరిగ్గా లేకపోతే చేసేది ఆ పనే… వ్యసనంలా మారిపోయిందంటున్న సత్య దేవ్!