Brahmamudi serial today Episode: హాస్పిటల్ లో రాజ్ గతం మర్చిపోయాడని డాక్టర్ చెప్పగానే.. యామిని హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో వాళ్ల అమ్మా నాన్నా షాక్ అవుతారు. అయితే నా ప్రేమను నాకు మళ్లీ దక్కించుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్తుంది యామిని. మరోవైపు హాస్పిటల్‌లో అపర్ణ బోరున ఏడుస్తుంది. అందరూ ఏడుస్తూనే అపర్ణను ఓదారుస్తుంటారు. ఇందిరాదేవి కూడా ఏడుస్తూ రాజ్ ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడు అపర్ణ నువ్వేం కంగారు పడొద్దు అంటుంది. దీంతో ప్రకాష్ మన అప్పు పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే ఉంది కదా.. అప్పు ద్వారా స్పెషల్ పర్మిషన్ తీసుకుని మనం కూడా ఆ లోయలో వెతుకుదాం అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ.. ఏవండి మన కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి వచ్చాడు. అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో వాడే కుమిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏదో ఉందండి. వీళ్లు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది అనగానే.. అపర్ణ ఏంట్రా ఏం ఉంది. ఇంకా నువ్వు చెప్పాల్సింది. మేము వినాల్సింది ఇంకా ఏమైనా ఉందా..? అని అడుగుతుంది.
దీంతో కళ్యాణ్.. పెద్దమ్మా అది.. అంటూ ఆగిపోగానే.. అపర్ణ కోపంగా మాట్లాడవేంట్రా.. అప్పు ఏం అయింది అమ్మా వెళ్లి ఏం తెలుసుకున్నారు. కావ్య చెప్పినట్టు ఈ షర్ట్ వల్ల వాడు చనిపోయాడని ఎలా అనుకోవాలి చెప్పు.. అంటుండగానే కనకం కూడా అప్పు ఏమైందే చెప్పవే.. కావ్య ప్రాణాలతో ఉంది కదా.. మరి అల్లుడు గారు కూడా అదే కారులో ఉన్నారు కదా..? మరి ఎందుకు తను అక్కడ దొరకలేదు. మీ పోలీసులు వెళ్లి ఏం తెలుసుకున్నారు చెప్పవే.. అంటూ నిలదీస్తుంది. ఇంకా మన అందరి గుండెల్లో చిచ్చు పెట్టు మాటలు ఉన్నాయా..? అని అడుగుతుంది. దీంతో అప్పు ఏడుస్తూ అమ్మా ఏం చెప్పమంటావు.. బావ మన కుటుంబానికి దేవుడు.. ఆ దేవుడు ఉన్నాడని చెప్పనా..? అసలు లేడని చెప్పనా..? లేడమ్మా.. బావ ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయాడు. అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతూ ఇంకా ఎక్కువ ఏడుస్తారు.
మరోవైపు హాస్పిటల్‌లో యామిని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి రాజ్ సార్ వస్తువులు అన్ని పోలీసులకు దొరికేలా చేశాను. పోలీసులతో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాజ్ సార్ చనిపోయారని నమ్మేశారు. ఇక సర్చింగ్ ఆపేసినట్టే అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో యామిని వాళ్ల అమ్మా ఏంటమ్మా ఇదంతా అని అడుగుతుంది. దీంతో యామిని నా కథ నేనే రాసుకుంటున్నాను. రాజ్ జీవితంలో ఒక కొత్త ఆధ్యాయం మొదలుపెట్టబోతున్నాను. రాజ్ ఇప్పుడు రామ్ గా మారిపోతున్నాడు అని చెప్తుంది. ఐసీయూలో ఉన్న రాజ్‌కు మెలుకువ వస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిన యామిని ఏడుస్తూ.. బావ నువ్వు మళ్లీ నాకు దక్కుతావని అనుకోలేదు బావ. ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి తిండి నిద్ర మానేసి నేను ఇక్కడే ఉన్నాను అంటుంది. దీంతో రాజ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు.
దీంతో యామిని ఎవరు నేనా.. నేను నీ యామినిని బావ అని చెప్తుంది. యామినియా..? నాకు తెలియదు అంటాడు రాజ్. దీంతో యామిని తన అమ్మా నాన్నలను పిలిచి బావ నన్ను గుర్తు పట్టడం లేదు. మీరైనా చెప్పండి అంటూ సరిగ్గా చూడు బావ మా మమ్మీ, మా డాడీ కనీసం వీళ్లైనా గుర్తు న్నారా..? అని అడుగుతుంది. లేదు నాకేం గుర్తు రావడం లేదు. అసలు నేను ఎవరు..? నా వాళ్లు ఎవరు… అంటూ చిరాకు పడుతుంటే యామిని డాక్టర్‌ను పిలుస్తుంది. డాక్టర్ వచ్చి రాజ్‌కు ఇంజక్షన్ ఇచ్చి కూల్ గా ఉండమని.. పేషెంట్‌ను డిస్టర్బ్ చేయోద్దని చెప్తాడు. అతన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాడు. దీంతో యామినిని పక్కకు తీసుకెళ్లి వాళ్ల అమ్మా నాన్నా తిడతారు. అయినా యామిని వినదు. కాదు కూడదు అంటే మళ్ళీ నేను ఆ మత్తుకే బానిసైపోతాను అని బెదిరిస్తుంది.
మరోవైపు కావ్య స్పృహలోకి వస్తుంది. అందరూ నిలబడి ఉంటారు. యాక్సిడెంట్ జరిగిన చోట సరిగ్గా వెతికారా..? ఆయన నిజంగా కనిపించలేదా..? చెప్పవే..? నువ్వు ఉండి కూడా సరిగ్గా వెతక్కుండా ఎలా వదిలేశావు ఆయన ఎక్కడో ఒక చోట ఉంటారే..? ఆయనకేం కాదు అంటూ ఏడుస్తుంది. పద ఇప్పుడు వెళ్లి వెతుకుదాం పద అంటుంది. దీంతో కనకం కోపంగా ఏంటో నువ్వు ఇప్పుడు వెళ్లి వెతుకుతావా..? నువ్వు పరిస్థితుల్లో ఎలా వెతుకుతావే అంటుంది. అప్పు కూడా స్పాట్లో మొత్తం వెతికాం.. అక్కడ ఏ క్లూ కూడా దొరకలేదు అని చెప్తుంది. దీంతో కావ్య ఏడుస్తూ.. అందరినీ తిడుతుంది. దీంతో అపర్ణ కూడా కావ్యకు రాజ్ చనిపోయాడనే విషయం ఇన్‌డైరెక్టుగా చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?