OTT Movie : మనిషి పుట్టాక ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు నిజ జీవితంలో జరిగినట్టుగానే ఉంటాయి. అలాంటి సినిమాలు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీల్ గుడ్ మూవీ కూడా అలానే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకున్న ఒక క్రిమినల్ ని, ఒక మహిళ ప్రేమిస్తుంది. ఈ స్టోరీ మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘లేబర్ డే’ (Labour Day). జాయ్స్ మేనార్డ్ రాసిన నవల ఆధారంగా జాసన్ రీట్‌మాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కేట్ విన్స్‌లెట్, జోష్ బ్రోలిన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని పారామౌంట్ పిక్చర్స్, ఇండియన్ పెయింట్ బ్రష్ కలసి నిర్మించాయి. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనగా నిలిచింది. ఈ మూవీలో అందాలతార కేట్ విన్స్‌లెట్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ తన భర్తతో కాకుండా విడిగా ఉంటూ, తన కొడుకుని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన భర్త వేరొకరిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆదివారాలు మాత్రం కొడుకుని చూసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇలా ఉంటే హీరోయిన్ ఇంటికి జైలు నుంచి తప్పించుకున్న ఒక క్రిమినల్ వస్తాడు. ఒక రోజు ఇంట్లో ఉండి వెళ్ళిపోతానని వాళ్లతో చెప్తాడు. తనకు గాయం అయిందని, దానికి కాస్త ట్రీట్మెంట్ కూడా చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. మొదట అతన్ని చూసి వీళ్లు భయపడతారు. ఆ తర్వాత అతని ప్రవర్తన చూసి బాగా కలిసి పోతారు. మరోవైపు టీవీలో హీరో గురించి చెప్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తారు. నిజానికి హీరో ఏ తప్పు చేసి ఉండడు. తన భార్య ఒక కొడుకుని కంటుంది. అతన్ని చూసుకోకుండా పబ్బుకు వెళ్లి వస్తుంది. హీరో ఆమెతో ఎందుకిలా చేశావని అడుగుతూ, బిడ్డ ఎవరికి పుట్టాడని నిలదీస్తాడు. అందుకు ఆమె నీకు పుట్టలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది. కోపంతో ఆమెను వెనక్కి నెట్టుతాడు. ఆమె కింద పడి తల పగిలి చనిపోతుంది. ఆ తర్వాత బిడ్డ కూడా ఒక నీటి టబ్ లో పడి చనిపోతాడు. తాను చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. చివరికి వీళ్ళ ప్రేమ నిలుస్తుందా? హీరోని పోలీసులు పట్టుకుంటారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లేబర్ డే’ (Labour Day) అనే ఈ మూవీని చూడండి.