Soundarya : టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య గురించి తెలియని వాళ్ళు ఉండరు.. అలనాటి నటి సావిత్రి తర్వాత ఆ స్థానాన్ని సౌందర్యకు ప్రేక్షకులు ఇచ్చారు. అందుకే ఆమె సినిమాలంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు. సౌందర్య చేసిన సినిమాలు అభిమానుల మనసు దోచుకున్నాయి. ఆమె చనిపోయిన కూడా ఆమె మీద అభిమానం మారలేదు. సౌందర్య చనిపోవడం ఇప్పటికి మిస్టరీ గానే ఉంది. ఎలా చనిపోయారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోవడం విధి రాసిన రాత అని అంటున్నారు. తన పెళ్లే ఆమెకు శాపంగా మారిందట.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సౌందర్య బెంగుళూరు అమ్మాయి. తెలుగులోనే సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా తెలుగులోనే అడుగు పెట్టింది. ఒక్కో సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకుంది. ఇక రాజకీయాల్లో కి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే చనిపోయిందని అందరికి తెలిసిందే. ఆమె నట జీవితం నుంచి మరణం వరకూ ఎన్నో జరిగాయి. నిజానికి ఆమె మరణం ఓ మిస్టరీ. ఈరోజు ఆమె మన ముందు ఉంటే భాజపా ప్రభుత్వం లో ఓ కీలక పదవిలోనూ ఉండి ఉండేది.. మనువరాలి పెళ్లి మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సౌందర్య ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ రూ. 25 వేలు.. ఇండస్ట్రీలో ని స్టార్ హీరోలతో నటించి మంచి పేరును అందుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. గొప్ప నటి దొరికింది అనుకునేలోపు మల్లి ఇండస్ట్రీకి దూరం అయ్యింది.. ప్రమాదవ శాత్తు ఆమె మరణించింది. ఆమె మరణానికి కారణం ఇదే అంటూ ఒక దారుణమైన నిజం బయట పడింది.
ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు.. అదే ఆమె జీవితానికి మచ్చగా మారింది. ఆమె పెళ్లి తల్లి దండ్రులకు నచ్చలేదు. సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే ఆమె తల్లిదండ్రలకు ఇష్టం లేదట. ప్రతి విషయంలోనూ తల్లి దండ్రుల మాట తీయని సౌందర్య పెళ్లి విషయంలో మాత్రం అలా చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. సౌందర్య వరుసకు మామ అయిన వ్యక్తి రఘు ను ప్రేమించింది. అయితే వీరిద్దరి జాతకాలలో ఏదో దోషం ఉండటం వల్ల ఆమె పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదట.. కానీ సౌందర్య మాత్రం అతన్నే చేసుకుంటానని అనుకుంది.. పెద్దలను ఒప్పించి చివరకు పెళ్లి చేసుకుంది.. అంతా బాగుంది అనుకున్నారు. అంతలోనే ఆ దోషమే శాపంగా మారింది. 31 ఏళ్లకే మరణించింది… ఇప్పటికే ఆమె మరణించి 20 ఏళ్లు అయిన ఇంకా యాక్సిడెంట్ ను మర్చిపోలేకున్నారు. ఏది ఏమైనా అలాంటి నటి మల్లి ఇండస్ట్రీకి దొరకదు.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చెయ్యలేరు.. ఇప్పటికి ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె భౌతికంగా లేకున్నా కూడా మనసులో సౌందర్య ప్రతి రూపం ఉంటుంది అని భాద పడుతున్నారు. సౌందర్య సినిమాలు ఎప్పుడు వచ్చినా టీవీ లకు అతుక్కొని సినిమాలను చూస్తున్నారు.. ఇలాంటి గొప్ప నటి ఇండస్ట్రీకి దూరం అవ్వడం బాధాకరం.