E-Paper
Advertisement

ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది
Advertisement

Kamran Akmal Warns Pakistan: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విజయంపై కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పై ఒక్క మ్యాచ్ గెలిచి తెగ సంబరపడిపోకండి అని.. వాళ్లు రివర్స్ ఎటాక్ చేస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని హెచ్చరించాడు. గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా… కచ్చితంగా ఫైనల్స్ కు చేరుతుందని అంచనా వేశాడు. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టీమిండియా అద్భుతంగా ఆడి.. పాకిస్తాన్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశాడు. అందుకే ఒక్క మ్యాచ్ గెలిచి సంబరపడిపోకండని పాకిస్తాన్ క్రికెటర్లకు చురకలు అంటించాడు.

పాకిస్తాన్ ప‌క్కా ప్లానింగ్ తో గెలిచింది – కమ్రాన్ అక్మల్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ పై కమ్రాన్ అక్మల్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు అన్ని విభాగాలు అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నాడు. టాస్ పాకిస్తాన్ గెలవడం బాగా కలిసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే 300కు పైగా పరుగులు సాధించి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టివేసిందని పాకిస్తాన్ జట్టుపై ప్రశంసలు వర్షం కురిపించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయి టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చార‌ని తెలిపారు. ప్రతి మ్యాచ్ లోను ఇదే ప్లానింగ్ తో వెళ్తే క‌చ్చితంగా పాకిస్తాన్ బలంగా తయారవుతుందని అంచనా వేశాడు. ఒత్తిడి నేపథ్యంలో తిలక్ వర్మ కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. తిలక్ వర్మతో పాటు షాబాద్ అహ్మద్ చివరి వరకు నిలబడి ఉంటే మ్యాచ్ స్వరూపం మారిపోయేదని వెల్లడించాడు. చివరి వరకు తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు.

ఫైనల్స్ లో పాకిస్తాన్ కు షాక్ తప్పదు

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియాను అస్సలు తక్కువగా అంచనా వేయకూడదని వార్నింగ్ ఇచ్చాడు కమ్రాన్ అక్మ‌ల్. నెక్స్ట్ జరిగే యూఏఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి కచ్చితంగా ఫైనల్ దాకా వస్తుందని తెలిపాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్యనే ఫైనల్ జరుగుతుందని పేర్కొన్నాడు. గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయిన టీమిండియా.. ఫైనల్ కు వచ్చి పాకిస్తాన్ ఓడిస్తుందని అంచనా వేశాడు. గాయపడ్డ సింహంలా పాకిస్తాన్ పై టీమిండియా పంజా విసరడం గ్యారంటీ అన్నాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

Big Stories

Advertisement
×