E-Paper
Advertisement

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

DC Movie OTT: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) తొలిసారి ముఖానికి రంగు వేసుకుని తెరపై కనిపించిన చిత్రం డీసీ. లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ (Arun matheswaran) దర్శకత్వం వహించారు. వామిక గబ్బి (Wamiqa Gabbi ) హీరోయిన్ గా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దర్శకుడుగా సత్తా చాటిన లోకేష్ కి నటుడిగా కూడా ఈ సినిమా ఆయన సత్తా ఏంటో నిరూపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన ఉత్కంఠ భరితమైన నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ గా మారింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న డీసీ..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ఒప్పందం తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 11 లేదా 18వ తేదీలలో ఏదో ఒక రోజు ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ చిత్రం..ఇకపోతే ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్లు బాగా వస్తున్నాయి కాబట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేటు ఇంకా పొడిగించే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో చంద్ర పాత్రలో వామికా గబ్బి తన అద్భుతమైన నటనతో అబ్బురపరచగా సంజన కృష్ణమూర్తి హీరోయిన్గా నటించింది.

Advertisement

also read:మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

డీసీ సినిమా స్టోరీ..

డీసీ సినిమా స్టోరీ విషయానికి వస్తే గ్యాంగ్ స్టార్ టీం లో కీలకంగా పనిచేసే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు (లోకేష్ కనకరాజ్). పోలీసుల ఆయుధాలను దొంగిలించడమే వీళ్ళ పని . అలా ఒకసారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలను దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఒక సామాన్య వ్యక్తి తన కొడుకు చదువు కోసం పొలం అమ్మి రూ.7 లక్షలు తీసుకు వెళుతూ ఉంటాడు. ఈ డబ్బులను ఒక పోలీస్ అధికారి తీసుకొని అతడిని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతడి భార్య దేవదాసు బృందాన్ని ఆశ్రయిస్తుంది.

ఆ ప్రశ్నల సమాధానమే..

Advertisement

ఇక విషయం తెలుసుకున్న దాసు ఆ పోలీస్ అధికారిని హత్య చేస్తాడు. దీంతో భోగరాజు నేతృత్వంలోని ఒక ప్రత్యేక పోలీస్ బృందం దాసు గ్యాంగ్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఇక ఈ క్రమంలో దాసు తన బృందంతో కలిసి విజయవాడలోని ఒక బార్ లో తలదాచుకుంటారు. అక్కడ బారు సింగర్ పార్వతి (సంజనా కృష్ణమాచారి) ను దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర (వామికా గబ్బి) కి విముక్తి కలిగిస్తాడు దేవదాసు. దీంతో ఆమె కూడా అతడి వెంటే వస్తుంది. వీరి జర్నీ ఎలా సాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్ గ్యాంగ్ స్టార్ ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం చివరికి ఎలా ముగిసింది? అనేది సినిమా స్టోరీ. థియేటర్లలో కోట్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా అటు ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Big Stories

Advertisement
×