BCB suspends BPL: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board) పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. డబ్బులు లేక ఆ క్రికెట్ బోర్డు నాన అవస్థలు పడుతోంది. ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Bangladesh Premier League) కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డు తీవ్ర స్థాయిలో నష్టపోయింది. దీంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది BCB. దాదాపు 40 కోట్ల టాకాలు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు BPL కారణంగా నష్టం జరిగిందని.. ఈ నేపథ్యంలోనే నిరవధికంగా టోర్నమెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు BCB అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) సంచలన ప్రకటన చేశారు. ఇక తమీమ్ ఇక్బాల్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఉలిక్కి పడుతున్నారు. కాగా గతంలో BCB బోర్డు సభ్యులు అవినీతికి పాల్పడినందుకే ఈ టోర్నమెంట్ వల్ల నష్టాలు జరిగినట్లు చెబుతున్నారు. నిర్వహణ లోపాలు, బెట్టింగ్ కారణంగా కూడా ఈ స్థితి వచ్చిందని చెబుతున్నారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) సంచలన ప్రకటన చేశారు. బీపీఎల్ టోర్నమెంట్ కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కు 40 కోట్ల టాకాలు అంటే దాదాపు 3.27 మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని వివరించారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా బోర్డుకు లాభాలు రాకపోగా.. తీవ్రంగా నష్టం జరిగిందని వివరించారు.
ఇన్ని నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఆ టోర్నమెంట్ నడపలేమని తమీమ్ ఇక్బాల్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే, సస్పెన్షన్ విధిస్తున్నామని.. భవిష్యత్తులో ఈ టోర్నమెంట్ ను నిర్వహించాలా ? లేదా పూర్తిగా రద్దు చేయాలని దానిపైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వచ్చే సీజన్ నుంచి మాత్రం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కచ్చితంగా ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టం ప్రకటన చేయలేదు తమీమ్ ఇక్బాల్ ( Tamim iqbal).
ఈ ఏడాది నుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Bangladesh Cricket Board) నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు తమీమ్ ఇక్బాల్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గర్వపడేలా… రూల్స్ కు లోబడి నిర్వహించాల్సి ఉంది… కానీ ఇప్పటి వరకు జరిగిన టోర్నమెంట్లలో ఎవరు కూడా రూల్స్ పాటించలేదని తెలిపారు. ఈ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను పునర్ నిర్మించడానికి తనకు సమయం కావాలన్నారు. 6 నుంచి 12 నెలల పాటు సమయం తీసుకొని.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను నిర్వహించడం పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రస్తుతానికి అయితే, బ్యాట్, బాల్ కొనలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉందన్నారు.