iPhone 17 vs Galaxy S26 Ultra: ఐఫోన్ 17 మరోసారి తన సత్తా చాటింది. తాజా కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ర్యాంకింగ్‌లో ఐఫోన్ 17 మొదటి స్థానాన్ని దక్కించుకుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యాపిల్, శాంసంగ్ సంస్థలే ఆధిపత్యం చూపించాయి.
తాజా త్రైమాసికంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో iPhone 17 ఏకంగా 6 శాతం వాటాను సాధించింది. గతేడాది ఇదే సమయంలో iPhone 16కు 4 శాతం మార్కెట్ షేర్ మాత్రమే వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 17లో 120Hz డిస్‌ప్లే రావడం వినియోగదారులను ఆకట్టుకుంది. గత స్టాండర్డ్ మోడల్‌లో 60Hz డిస్‌ప్లే ఉండేది.
iPhone 17 తర్వాత రెండో స్థానంలో iPhone 17 Pro Max, మూడో స్థానంలో iPhone 17 Pro నిలిచాయి. iPhone 17e ఏడో స్థానంలో ఉండగా.. iPhone 16 పదో స్థానంలో కొనసాగింది. మొత్తంగా టాప్ 10లోయాపిల్‌కు ఐదు స్థానాలు దక్కాయి.
Also Read:
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా నాలుగో స్థానంలో నిలిచింది. గెలాక్సీ S26 తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక గెలాక్సీ A07 4G ఐదో స్థానంలో, గెలాక్సీ A17 5G ఆరో స్థానంలో, గెలాక్సీ A17 4G ఎనిమిదో స్థానంలో నిలిచాయి. దీంతో శాంసంగ్ కూడా టాప్ 10లో ఐదు మోడళ్లను నమోదు చేసింది.
తాజా ర్యాంకింగ్‌లో షియోమీ ఒక్క మోడల్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇదే సమయంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం 11 శాతం తగ్గింది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, ఫోన్ ధరలు పెరగడం వంటి కారణాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అధిక లాభాలు వచ్చే ప్రీమియం ఫోన్లపై కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.
Also Read: POCO X8 సిరీస్ లాంచ్‌కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో X8 Power 5G!