E-Paper
Advertisement

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!
Advertisement

Ather Konark Launched: భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. కంపెనీ యాన్యువల్ కమ్యూనిటీ డే సందర్భంగా ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1 లక్షగా కంపెనీ నిర్ణయించింది. కొత్త స్కూటర్‌ను వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలు, రేంజ్‌ లతో మూడు ప్రధాన వేరియంట్లలో తీసుకొచ్చింది. కోనార్క్ S 100, S 125, S 161 పేర్లతో వచ్చాయి. త్వరలో 200 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ ఇచ్చే మరో వెర్షన్‌ ను కూడా కంపెనీ తీసుకురానుంది. అలాగే 125 కిలోమీటర్ల రేంజ్‌తో ఫీచర్లతో కూడిన కోనార్క్ Z వేరియంట్ కూడా లైనప్‌ లో చేరనుంది.

మూడు బ్యాటరీ ఆప్షన్లు

కోనార్క్ S 100లో 2.1kWh బ్యాటరీని ఉపయోగించారు. ఇది 4kW గరిష్ట శక్తిని, 16Nm టార్క్‌ను అందిస్తుంది. S 125లో 2.7kWh బ్యాటరీ, S 161లో 3.5kWh బ్యాటరీ ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు 4.7kW పీక్ పవర్, 16Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి. మూడు మోడళ్ల గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లుగా ఉంది. ఈ మూడు వేరియంట్ల రేంజ్ వరుసగా 80 కిమీ, 100 కిమీ, 130 కిమీగా ఉంటుందని ఏథర్ తెలిపింది.

ఛార్జింగ్‌కు రెండు ఆప్షన్లు

Advertisement

కోనార్క్‌ లో 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను స్టాండర్డ్‌ గా అందిస్తున్నారు. అదనంగా 900W ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో మొత్తం ఛార్జింగ్ సామర్థ్యం 1.35kWకు చేరుతుంది. సాధారణ ఛార్జర్‌తో 0-80 శాతం ఛార్జింగ్‌కు S 100కి నాలుగు గంటలు, S 125కి 4 గంటల 30 నిమిషాలు, S 161కి 5 గంటల 40 నిమిషాలు పడుతుంది. కంబైన్డ్ ఛార్జర్‌ తో టైమ్ మరింతగా తగ్గుతుంది.

31 లీటర్ల బూట్ స్పేస్

రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోనార్క్‌ లో సీటు కింద 31 లీటర్ల స్టోరేజ్ ఇచ్చారు. 18W USB టైప్-C పోర్ట్, అండర్-సీట్ ల్యాంప్ కూడా ఉన్నాయి. S 100లో 4.2 అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే ఉండగా, ఖరీదైన వేరియంట్లలో 7 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. పార్క్ అసిస్ట్ రివర్స్, ఆటోహోల్డ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త టెక్నాలజీ ఫీచర్లు

Advertisement

కోనార్క్ Z వేరియంట్లలో ఏథర్ కొత్త AEBS బ్రేకింగ్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ ద్వారా బ్రేకింగ్‌ను మెరుగుపరచి, ఆగే దూరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే మ్యాజిక్‌ కీ ఫీచర్ ద్వారా ఏథర్ యాప్‌ను ఉపయోగించి ఫిజికల్ కీ లేకుండానే బూట్‌ను అన్‌ లాక్ చేయవచ్చు. Z 161లో ఆటోపాప్ ఫంక్షన్ కూడా ఉంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏథర్ కోనార్క్ S 100 ధర రూ.1 లక్షగా, S 125 ధర రూ.1.22 లక్షలుగా, S 161 ధర రూ.1.45 లక్షలుగా నిర్ణయించారు. Z 125, Z 161 వేరియంట్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కోనార్క్ డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి.

Read Also: టీవీఎస్ జూపిటర్ కు కొత్త లుక్.. సీక్వెన్షియల్ ఇండికేటర్లతో కొత్త స్కూటర్!

Tags

Related News

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

టీవీఎస్ జూపిటర్ కు కొత్త లుక్.. సీక్వెన్షియల్ ఇండికేటర్లతో కొత్త స్కూటర్!

యమహా కొత్త బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఓలాకు బిగ్ షాక్.. ఈ-స్కూటర్ మార్కెట్‌ లో నంబర్‌ వన్‌ గా టీవీఎస్!

పండుగ సీజన్‌ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్‌లు రెడీ!

MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!

Big Stories

Advertisement
×