E-Paper
Advertisement

మంగ్లీ కేసులో కేంద్ర మంత్రి.. నిజాలు బయటపెట్టిన లాయర్ సుబ్బారావు!

మంగ్లీ కేసులో కేంద్ర మంత్రి.. నిజాలు బయటపెట్టిన లాయర్ సుబ్బారావు!
Advertisement

Singer Mangli:ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఇటీవల మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వివాదంలో ప్రముఖ గాయని మంగ్లీ పై రోజుకొక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా వచ్చిన ఆరోపణలు రోజుకో మలుపు తీసుకుంటూ.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇకపోతే ఈ వివాదంలో అడ్వకేట్ సుబ్బా రావు (Advocate Subbarao) రాజీ పడ్డారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు రాగా.. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు.

మంగ్లీ తో నేను రాజీ పడలేదు – లాయర్ సుబ్బారావు

మైక్రో ఫైనాన్స్ కేసు లో భాగంగా మంగ్లీ మనుషుల నుంచి కోట్ల ఆఫర్ వచ్చిందని, దీనికి ఆయన ఒప్పుకొని రాజీ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.. ఈ విషయంపై తాజాగా లాయర్ సుబ్బారావు మాట్లాడుతూ..” మంగ్లీ మనుషుల నుంచి కోట్ల ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ నేను ఆ ఆఫర్ ను తిరస్కరించాను. అయితే ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.

నిందితురాలికి దేశం దాటి వెళ్లే హక్కు ఎవరిచ్చారు – సుబ్బారావు

Advertisement

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ పై నేను, నాపై నిరాధారమైన ఆరోపణలతో మంగ్లీ వేసిన కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీని అమెరికాలో ఎన్నారై తెలుగు నిర్వాహకులు అంతర్జాతీయ కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ కేసులో నిజానిజాలు తేలే వరకు ఆమెకు విదేశీ వేదికలపై అవకాశాలు ఇవ్వకూడదు.ఈ విషయంపై ఇప్పటికే నేను ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశాను అంటూ తెలిపారు.

also read:నాగార్జున బర్త్ డే స్పెషల్.. ‘కింగ్ 100’ నుండి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

మంగ్లీ వెనుక ఉన్న కేంద్ర మంత్రి ఎవరు?

Advertisement

ఇక ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు మమ్మల్ని ఊరు దాటి వెళ్ళకూడదు అని ఆంక్షలు విధిస్తుంటే.. నిందితురాలిగా ఉన్న మంగ్లీ మాత్రం ఎలా విదేశాలకు దేశం దాటి వెళ్తోంది? అంటూ నిలదీశారు. ఆమెను అరెస్టు కాకుండా వెనకుండి కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరు? అనేది ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని కూడా సుబ్బు పిలుపునిచ్చారు.. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న డ్రైవర్ ఏమయ్యాడు? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు లాయర్ సుబ్బు. బాధితులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని కామెంట్లు చేశారు. ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ కేసులో రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు పై ఇప్పుడు అడ్వకేట్ చేసిన కామెంట్లు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

ఏంటీ, మైక్రో ఫైనాన్స్ కేస్!

మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మబలికి.. తనతో పాటు ఆమె సోదరుడు సహా కొంతమంది ప్రజలను కోట్లల్లో మోసగించారని బాధితులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోసపోయిన వారిలో ఒకరైన హిమాకాంత్ రెడ్డి ,తదితరులు తనను సంప్రదించారని చెప్పిన్ సికింద్రాబాద్ కి చెందిన న్యాయవాది సుబ్బారావు.. విషయం తెలుసుకోవడానికి మంగ్లీని సంప్రదిస్తే ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. మంగ్లీ ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు కాగా.. మంగ్లీ కూడా సుబ్బారావు పై అదే పోలీస్ స్టేషన్లో తనపై దుష్ప్రచారం చేసి, పాపులారిటీ పొందాలని చూస్తున్నట్లు ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చింది.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×