BigTV English

OTT Movie : 16 ఏళ్ల బాలికకు 32 ఏళ్ల పిచ్చోడితో పెళ్లి… ఇలాంటి పిచ్చి వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : 16 ఏళ్ల బాలికకు 32 ఏళ్ల పిచ్చోడితో పెళ్లి… ఇలాంటి పిచ్చి వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో లవ్ స్టోరీలతోనే ఎక్కువగా సినిమాలను తీస్తూ వచ్చారు మేకర్స్. ప్రతీ జానర్ లో ఏదో ఒక లవ్ స్టోరీని జత చేస్తూ ఉంటారు. అంతలా ఈ లవ్ స్టోరీలు ప్రేక్షకుల మీద ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక జంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి నానా తంటాలు పడతారు. చివరికి ఈ స్టోరీ ఒక ఊహించని క్లైమాక్స్ తో ముగుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ పంజాబీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లవర్’ (Lover). 2022 లో వచ్చిన ఈ సినిమాకి దిల్షేర్ సింగ్, ఖుష్పాల్ సింగ్ దర్శకత్వం వహించారు. కె.వి. ధిల్లాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో గురి (లల్లీ పాత్రలో), రోనక్ జోషి (హీర్ పాత్రలో), యశ్పాల్ శర్మ, అవతార్ గిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 జూలై 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు IMDB లో 7.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

లల్లీ అనే యువకుడు పంజాబీ గ్రామీణ వాతావరణంలో పెరుగుతాడు. అతను తన స్కూల్‌మేట్ హీర్ తో గాఢంగా ప్రేమలో పడతాడు. హీర్ కూడా అంతే గాఢంగా లల్లీని ప్రేమిస్తుంది. ఇక వీళ్ళు ప్రేమలో మునిగి తేలుతుంటారు. సరదాలు, షికార్లతో చిన్న చిన్న ఆనందాలు పొందుతుంటారు. అయితే అనుకున్నట్టుగా వీళ్ళ ప్రేమ కథ సాఫీగా సాగదు. హీర్ మామ వీళ్ళ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అతను లల్లీ, హీర్‌ను విడదీయడానికి గట్టి చర్యలు తీసుకుంటాడు. ఇతని జోక్యంతో హీర్ కుటుంబం కూడా వీళ్లపై ఒత్తిడి తెస్తుంది. ఆమె తన ప్రేమను కాపాడుకోవడానికి, కుటుంబ పరువును నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. లల్లీ తన ప్రేమను కోల్పోవడంతో కుంగిపోతాడు. అతను హీర్‌ను తిరిగి తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ హీర్ మామ ప్రభావం, కుటుంబ ఒత్తిడులు వారి మధ్య దూరాన్ని పెంచుతాయి.

లల్లీ తన ప్రేమను నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అతను హీర్‌తో రహస్యంగా కలవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె కుటుంబంతో మాట్లాడేందుకు ధైర్యం చేస్తాడు. అయితే హీర్ యొక్క కుటుంబం, ముఖ్యంగా ఆమె మామ అతని ప్రయత్నాలను నిరంతరం అడ్డుకుంటారు. ఇలా విడిపోవడం లల్లీని కూడా మానసికంగా బాధపెడుతుంది. హఠాత్తుగా హీర్ కి తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన తన మామతో పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు ఆమె కుటుంబ సభ్యులు. ఇక లల్లీ తన ప్రేమను తిరిగి గెలుచుకోవడానికి చివరి సారిగా ఒక ప్రయత్నం చేస్తాడు. అతను హీర్ కుటుంబాన్ని ఎదుర్కొంటాడు. ఈ దశలో హీర్ కూడా తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చివరికి హీర్ తన కుటుంబ ఒత్తిడులకు లొంగిపోతుందా ? లల్లీతో కలిసి తన ప్రేమను పంచుకుంటుందా ? వయసులో పెద్దవాడైన తన మామను పెళ్ళి చేసుకుంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : భర్తను టార్చర్ చేస్తే కావలసినన్ని డబ్బులు ఇచ్చే డబ్బా… ఇలాంటి వింత మూవీని ఎక్కడా చూసుండరు మావా

Related News

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

OTT Movie : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

OTT Movie : టీనేజ్ కూతురున్న తల్లిపై ప్రేమ… మనసుకు హత్తుకునే మలయాళ ఆంథాలజీ

OTT Movie : మజా ఇచ్చే రాజకీయాలు… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులున్న హిందీ డార్క్ కామెడీ – క్రైమ్ డ్రామా

Big Stories

×