Priyanka Jain: ప్రియాంక జైన్(Priyanka Jain) పరిచయం అవసరం లేని పేరు. మౌనరాగం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సీరియల్ అనంతరం బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఎలాంటి సీరియల్ కు ప్రియాంక కమిట్ అవ్వకపోయినా పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రియాంక మౌనరాగం సీరియల్ నటుడు శివకుమార్(Shiva Kumar) తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
ఆర్టిఫిషియల్ కపుల్స్.. వ్యూస్ కోసమేనా?
ఇలా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించి ఇప్పటికీ కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరు పెళ్లి చేసుకోకపోవడంతో వీరు పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. తాజాగా యాంకర్ శివకుమార్ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక శివకుమార్ ఇద్దరు పాల్గొన్నారు. అయితే యాంకర్ మీరు పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకురావడంతో త్వరలోనే మీ అందరికీ పప్పన్నం పెడతానని చెప్పారు. అంతవరకు బానే ఉన్నా యాంకర్ చాలామంది మీ వీడియోస్ చూసి మీరు ఆర్టిఫిషియల్ కపుల్స్(Artificial Couples) అంటున్నారు నిజమేనా? కేవలం వ్యూస్ కోసమే అలా చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
అవమానించడానికే పిలిచారా?
ఈ ప్రశ్నకు శివకుమార్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ ప్రశ్న ఎవరైనా అడిగి ఉంటే నేను సమాధానం చెప్పేవాడిని కానీ మా గురించి అన్ని తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం బాగాలేదు అంతేకాకుండా ఆర్టిఫిషియల్ అనే మాట ప్రతిసారి అంటుంటే నచ్చలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేను అన్న మాట కాదు, మీ వీడియోలకు నెటిజన్స్ చేస్తున్న కామెంట్లు అంటూ యాంకర్ చెప్పినప్పటికీ.. శివకుమార్ మాత్రం ఫైర్ అవుతూ.. ఇలా మమ్మల్ని అవమానించడానికి ఇక్కడికి పిలిచావా? అంటూ ఊగిపోయారు. అంతేకాకుండా ప్రియాంక చేతిలో ఉన్న పిల్లో తీసుకొని ఒక్కసారిగా యాంకర్ శివపై విసిరి కొట్టారు.
ప్రియాంక మెడలో మూడు ముళ్ళు..
ఇలా ఈ విషయం గురించి యాంకర్ శివకుమార్ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఇక అక్కడే ఉన్న ప్రియాంక శివకుమార్ ను కంట్రోల్స్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అని మాకు తెలుసు ఎందుకు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రియాంక శివకుమార్ జంట గురించి ఇదివరకు ఎంతోమంది ఈ తరహా ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామంటూ చెబుతున్న వీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే శివకుమార్ మాత్రం ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే యూట్యూబ్ వీడియోల కోసం ప్రియాంక మెడలో తాళి కట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ జంట నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.
Also Read: దయచేసి నన్ను క్షమించండి.. మరో వీడియో వదిలిన శిరీష్ రెడ్డి!