OTT Movie : కొన్ని సినిమాలు ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంటాయి. కథకు అదే కీ రోల్ పోషిస్తుంటుంది. క్లైమాక్స్ వరకూ ఆ పాయింట్ తోనే సినిమా నాడుస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక డబ్బులు ఇచ్చే మాయా వస్తువు ఉంటుంది. స్టోరీ దీని చుట్టూ తిరుగుతుంది. అయితే అది డబ్బులు ఊరికే ఇవ్వదు. అది ఎలా ఇస్తుందో స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ ఫాంటసీ కామెడీ-థ్రిల్లర్ మూవీ పేరు ‘The Brass Teapot’. 2012లో విడుదలైన ఈ సినిమాకి రమా మోస్లీ దర్శకత్వం వహించారు. ఇందులో జూనో టెంపుల్ (ఆలిస్), మైఖేల్ అంగరానో (జాన్), అలెక్సిస్ బ్లెడెల్, మరియు బిల్లీ మాగ్నస్సెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘The Brass Teapot’ ప్రస్తుతం Amazon Prime Video, Apple TV లలో అందుబాటులో ఉంది . 101 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
జాన్, ఆలిస్ అనే ఒక కొత్తగా పెళ్ళయిన జంటఒక చిన్న పట్టణంలో నివశిస్తుంటారు. వీళ్ళకు ఒకరి మీద ఒకరికి అమితమైన ఇష్టం ఉంటుంది. అయితే వీళ్ళు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. జాన్ ఒక తక్కువ జీతం ఇచ్చే టెలీమార్కెటింగ్ ఉద్యోగంలో పనిచేస్తుంటాడు. ఆలిస్ ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పొందినప్పటికీ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళ స్నేహితులు సౌకర్యవంతమైన జీవితాన్ని ఆనందిస్తుంటే, జాన్, ఆలిస్ బిల్లులు చెల్లించడానికి కూడా కష్టపడుతుంటారు.
ఇలా ఉంటే ఒక రోజు జాన్, ఆలిస్ ఒక చిన్న కారు ప్రమాదంలో చిక్కుకుంటారు. దీని ఫలితంగా వాళ్ళు ఒక యాంటీక్ షాప్ దగ్గర ఆగతారు. అక్కడ ఆలిస్ ఒక బ్రాస్ టీపాట్‌ను చూసి ఆపుకోలేక దాన్ని దొంగిలిస్తుంది. దానిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఆలిస్ అనుకోకుండా తనను తాను కాల్చుకుంటుంది. వెంటనే టీపాట్ నుండి డబ్బు బయటకు వస్తుంది. ఈ జంట త్వరలోనే ఈ టీపాట్ మాయాజాల శక్తులను కలిగి ఉందని, శారీరక బాధ అనుభవించినప్పుడు డబ్బును ఇస్తుందని గుర్తిస్తారు. ఎంత ఎక్కువ శరీరాన్ని బాధ పెట్టుకుంటే, ఇది అంత ఎక్కువ డబ్బు ఇస్తుందని తెలుసుకుంటారు.
మొదట ఈ జంట చిన్న చిన్న గాయాలతో డబ్బు సంపాదిస్తారు. వీళ్ళ ఆర్థిక ఇబ్బందులు కూడా తీరుతాయి. వీళ్ళు కొత్త ఇల్లు, కారు విలాసవంతమైన జీవనశైలితో జీవిస్తారు. అయితే ఉన్నట్టుండి టీపాట్ ఎక్కువ డబ్బు ఇవ్వడం మానేస్తుంది. దీనితో వాళ్ళు మరింత తీవ్రమైన బాధలకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మానసిక బాధకి కూడా అది రివార్డ్ ఇస్తుందని కనుగొంటారు. దీంతో ఈ జంట ఒకరినొకరు మానసికంగా బాధపెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఇది వారి బంధాన్ని దెబ్బతీస్తుంది.
ఆతరువాత డాక్టర్ లింగ్ అనే ఆసియన్ వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి, టీపాట్ శక్తులు ప్రమాదకరమైనవని, ఇది గతంలో దాని యజమానులను నాశనం చేసిందని హెచ్చరిస్తాడు. అదే సమయంలో, యాంటీక్ షాప్ యజమాని మనవళ్ళైన ఇద్దరు సోదరులు టీపాట్‌ను తిరిగి పొందడానికి వస్తారు. ఆతరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది. చివరికి టీపాట్ ని ఈ జంట వదిలించుకుంటారా ? దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? దాని గత చరిత్ర ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫాంటసీ కామెడీ-థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 30 కోట్ల బడ్జెట్, 300 కోట్ల కలెక్షన్స్… ఆస్కార్ ను అందుకున్న ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?