BigTV English

OTT Movie : గ్యాంగ్ స్టర్ చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి… ఊహకందని శక్తులతో రివేంజ్ … నోరెళ్ళబెట్టించే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : గ్యాంగ్ స్టర్ చేతికి చిక్కే ఒంటరి అమ్మాయి…  ఊహకందని శక్తులతో రివేంజ్ … నోరెళ్ళబెట్టించే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు చూడటానికి అందుబాటులో ఉన్నాయి. సైన్స్, హారర్, కామెడీ జానర్ లలో ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే వీటిలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ, ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ కి ఒక డ్రగ్ వల్ల మెదడును 100% ఉపయోగించే శక్తి వస్తుంది. ఆ తర్వాత స్టోరీ ఒక రేంజ్ లో ముందుకు వెళుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్త్రీని అవుతుంది. అనే వివరంలోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో 

ఈ ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపేరు’లూసీ’ (Lucy). 2014 లో వచ్చిన ఈ మూవీకి లూక్ బెస్సన్ దర్శకత్వం వహించారు. అతని భార్య వర్జీనీ బెస్సన్-సిల్లా దీనిని నిర్మించారు. తైపీ, పారిస్, న్యూయార్క్ సిటీలలో ఈ మూవీ చిత్రీకరించబడింది. ఇందులో స్కార్లెట్ జాన్సన్, మోర్గాన్ ఫ్రీమాన్, చోయ్ మిన్-సిక్, అమ్ర్ వేక్డ్ వంటి నటులు నటించారు. ఈ చిత్రం 25 జూలై 2014న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $470 మిలియన్లకు పైగా వసూలు చేసింది. $40 మిలియన్ల బడ్జెట్ తో రూపొంది, దాని కంటే పదకొండు రెట్లు ఎక్కువ వసూళ్లు చేసి భారీ బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లూసీ ఒక ఒక సాధారణ అమెరికన్ విద్యార్థిని గా ఉంటుంది. తైవాన్‌లో ఒక డ్రగ్ డీల్‌లో బలవంతంగా చిక్కుకుంటుంది. ఆమె శరీరంలో CPH4 అనే సింథటిక్ డ్రగ్‌ను దాచి, రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఒక ఘటనలో ఆ డ్రగ్, ఆమె శరీరంలోకి విడుదలై, ఆమె మెదడు సామర్థ్యం అసాధారణంగా పెరుగుతుంది. సాధారణంగా మనుషులు తమ మెదడులో 10% మాత్రమే ఉపయోగిస్తారని, కానీ లూసీ దీని కారణంగా మెదడు 100% వరకు ఉపయోగించే సామర్థ్యం వస్తుంది. మెదడు సామర్థ్యం పెరగడంతో, లూసీకి అసాధారణ శక్తులు వస్తాయి. సమయాన్ని నియంత్రించడం, జ్ఞానాన్ని ఎక్కువగా గ్రహించడం వంటివి వస్తాయి. ఆమె తన శరీరాన్ని, డ్రగ్ డీలర్లపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు, ఈ శక్తులను మానవ జాతి ప్రయోజనం కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తుంది.

ఆమె ప్రొఫెసర్ నార్మన్ సహాయంతో, ఈ జ్ఞానాన్ని ఒక డిజిటల్ ఫార్మ్‌లో సంరక్షించే ప్రయత్నం చేస్తుంది.ఈ క్రమంలో ఆ రౌడీ బ్యాచ్ లూసీని చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు ఆమెకు అసాధారణ పవర్స్ ఉండటంతో, వాళ్ళను సులువుగానే ఎదుర్కొంటుంది. లూసీ తన మానవ రూపాన్ని కోల్పోయి, కాలంతో పాటు అనంతంగా విలీనమైపోతుంది. చివరికి లూసీకి ఆ డ్రగ్స్ ఇచ్చిన ఆ డీలర్ ఏమవుతాడు ? లూసీ ఇక సాధారణ మనిషిగా గడపలేదా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్  మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : చచ్చిన తండ్రితో మాట్లాడాలనుకుంటే దయ్యాలతో దబిడి దిబిడి … మోస్ట్ డేంజరస్ హారర్ మూవీ

Related News

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : వెంటాడే చెట్టు శాపం… ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసే పువ్వులు… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

Big Stories

×