BigTV English
Advertisement

OTT Movie : చచ్చిన తండ్రితో మాట్లాడాలనుకుంటే దయ్యాలతో దబిడి దిబిడి … మోస్ట్ డేంజరస్ హారర్ మూవీ

OTT Movie : చచ్చిన తండ్రితో మాట్లాడాలనుకుంటే దయ్యాలతో దబిడి దిబిడి … మోస్ట్ డేంజరస్ హారర్ మూవీ

OTT Movie : హారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమాలను ఇష్టంగా చూస్తూ ఎంటర్టైన్ అవుతారు. అయితే వీటిని రాత్రిపూట ఒంటరిగా చూడటం కొంచెం కష్టం అని చెప్పాలి. అందులోనూ హాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలలో కంటెంట్ భయంకరంగా ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ తో గుండెను ఆగిపోయేలా చేస్తాయి. కొన్ని సన్నివేశాలకి ప్యాంట్లు కూడా తడిసిపోతాయి. అంతలా భయపెట్టే సినిమాలు హాలీవుడ్ నుంచి ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలా ఉంటాయి. 1991లో మాడ్రిడ్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ కథ 15 ఏళ్ల అమ్మాయి వెరోనికా చుట్టూ తిరుగుతుంది. తండ్రి ఆత్మతో మాట్లాడటానికి కూతురు ప్రయత్నించడంతో, అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

ఈ స్పానిష్ హారర్ మూవీ పేరు ‘వెరోనికా’ (Veronica). 2017 లో వచ్చిన ఈ మూవీకి పాకో ప్లాజా దర్శకత్వం వహించారు. ఇందులో క్లాడియా ప్లేసర్, బ్రూనా గొంజాలెజ్, ఇవాన్ చావెరో, అనా టొరెంట్‌, సాండ్రా ఎస్కాసెనా నటించారు. ఇది 1991 నాటి ఒక కేసులోని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఎస్టీఫానియా గుటిరెజ్, లాజారో ఓయిజా బోర్డుని ఉపయోగించి అనుమానస్పదంగా మరణించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

వెరోనికాక తన తండ్రి మరణం తర్వాత, తన తోబుట్టువులు తల్లితో కలిసి జీవిస్తుంది. ఆమె తల్లి ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అందువల్ల వెరోనికా తన తోబుట్టువుల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. ఒక రోజు సూర్యగ్రహణం సమయంలో, వెరోనికా తన స్నేహితులతో కలిసి ఒక గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ ఆడి ఆత్మలతో మాట్లాడవచ్చు.ఆ గేమ్ పేరు ఓజా. ఈ ఓజా బోర్డ్ ను ఉపయోగించి తన తండ్రి ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో ఏదో తప్పు జరుగుతుంది. వెరోనికా అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో భయంకరమైన వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి.ఎపుడూ నీడలా ఆత్మలు వెంటాడతాయి. ఆమె ఇంట్లో చీకటి శక్తులు చొరబడినట్లు కనిపిస్తుంది. ఆమె తోబుట్టువులు కూడా ఈ భయంకరమైన శక్తుల ప్రభావానికి గురవుతారు. వెరోనికా ఈ దుష్టశక్తుల నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక సన్యాసిని సహాయం తీసుకుంటుంది. ఆమె ఈ దుష్టశక్తులను గుర్తించి, వాటిని వెల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంది. చివరికి వెరోనికా ఆ ఆత్మల నుంచి బయటపడుతుందా ? ఆమె వాటినుంచి ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? సన్యాసిని ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : సైకోలకు చిక్కే ఒంటరి అమ్మాయి… రాత్రంతా నరకం … అదిరిపోయే ట్విస్ట్ లతో హోరెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×