Malayalam Comedy Drama: వీకెండ్ వచ్చేసింది. ఎంచక్కా ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లోనే కూర్చుని చూడదగ్గ ఓ మంచి మూవీ కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ సినిమా సజెషన్ మీ కోసమే. 2026లో విడుదలై, మలయాళ సినిమా ప్రేమికులను అలరించిన క్లీన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘మధువిధు’ (Madhuvidhu). ఐదుగురు మగాళ్లు ఉండే ఇంటికి ఒక కోడలు ఎలా వచ్చింది ? హనీమూన్ కథలోని నవ్వులు, భావోద్వేగాలు, కామెడీ సందడి.. ఇలా సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.
ఈ సినిమా కథ అంతా ఒక సాంప్రదాయ కుటుంబం, ఆ ఫ్యామిలీలో జరిగే పెళ్లి చుట్టూ తిరిగే నవ్వుల జర్నీ. కోచ్చాంబళం అనే చిన్న ఊరిలో ఆంజలమూడు అనే ఇంట్లో ఐదుగురు మగాళ్లు మాత్రమే ఉంటారు. తండ్రి, బాబాయ్‌లు, కుమారులు… ఆడవాళ్లు ఎవరూ లేకపోవడం ఆ ఇంటి ప్రత్యేకత. ఊరి జనాలు ఈ కుటుంబానికి ఏదో ‘ఆడ శాపం’ ఉందని వదంతులు పుట్టిస్తారు. దాంతో ఆ ఇంటికి కోడలిగా రావాలని ఏ అమ్మాయి కూడా అనుకోదు.
ఆ ఇంట్లో ఉండే యువకుడు అమృత్ రాజ్ (షరాఫుద్దీన్). ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తపన పడుతుంటాడు. కానీ 28 పెళ్లి సంబంధాలు వచ్చి చెడిపోయి ఉంటాయి. ప్రతి సారీ కుటుంబ నేపథ్యం కారణంగా అమ్మాయి వాళ్లు వెనక్కి వెళ్ళిపోతుంటారు. అమృత్ రాజ్ తన తండ్రి, బాబాయ్‌లతో కలిసి పెళ్లి చూపుల కోసం ఊరూరూ తిరుగుతుంటాడు. ఈ ప్రయాణంలో ఎన్నో కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఎట్టకేలకు 29వ సంబంధంగా స్నేహ (కల్యాణి పణిక్కర్) అనే అమ్మాయి అమృత్ జీవితంలోకి వస్తుంది.
స్నేహ చురుకైన అమ్మాయి. అమృత్ రాజ్ స్నేహ వాళ్లింటికి పెళ్లి చూపుల కోసం వెళ్తాడు. అయితే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. అమృత్ రాజ్ తండ్రి స్నేహ అత్తను చూసి గతంలో తాను ఇష్టపడిన పాత ప్రేమికురాలు అని గుర్తుపడతాడు. ఆ ఇద్దరి మధ్య గతంలో ఉన్న ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చి పడుతుంది. తండ్రి చేసిన పని వల్ల అమృత్ రాజ్ పెళ్లి ఆగిపోతుంది.
స్నేహ తండ్రికి విపరీతమైన కోపం వచ్చి అమృత్‌ను ఇంటి నుండి వెళ్లగొడతాడు. అయినా సరే పట్టువదలని అమృత్ రాజ్ స్నేహను గెలుచుకోవడానికి ఎన్నో కామెడీ తంటాలు పడతాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్లి వేరే అబ్బాయితో ఖాయమవుతుంది. కానీ రేపు పెళ్లి అనగా సోఫీ తనకు ఆ అబ్బాయి ఇష్టం లేడని అమృత్‌కు చెప్తుంది. ఐదుగురు మగాళ్లు ఉన్న ఆ ఇంటికి చివరకు కోడలు ఎలా వచ్చింది ? స్నేహ తండ్రిని హీరో ఎలా ఒప్పించాడు ? అనేది తెలియాలంటే అశ్లీలత లేని ఈ స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను
మలయాళ సినిమా అభిమానులు చూడాల్సిందే. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విష్ణు అరవింద్ దర్శకత్వంలో రూపొందింది. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం SonyLIVలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ వీకెండ్ హ్యాపీగా చూడండి.
Read Also: ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు… ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు