E-Paper
Advertisement

ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు… ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు

ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు… ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు
Advertisement

Korean Romantic Drama: భార్యాభర్తల మధ్య బంధానికి పునాది నమ్మకం. కానీ కొన్ని అనవసరమైన కారణాల వల్ల ఆ పునాది పగిలిపోతే, బంధం బీటలు వారడానికి ఒక చిన్న మెసేజ్ కారణం అయితే ? పచ్చగా ఉన్న కాపురంలో ఒకే ఒక్క మెసేజ్ చిచ్చు రేపితే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ-డ్రామా సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పేరు ‘లిజన్ టు లవ్’ (Listen to Love). 2016లో విడుదలైన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ పెళ్లయి 8 ఏళ్లు దాటిన ఒక జంట మధ్య నడిచే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామా. దో హ్యున్-వూ టెలివిజన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తాడు. తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అతని సంసార జీవితం చాలా హ్యాపీగా సాగిపోతోందని నమ్మే వ్యక్తి. ఆఫీసు ఒత్తిడి మధ్య కూడా ఇంటి పనుల్లో భార్యకు తోడుగా ఉండే మంచి భర్తగా మసలుకుంటాడు. ఇక హ్యున్-వూ భార్య పేరు జుంగ్ సూ-యోన్. ఒక మల్టీ టాస్కింగ్ ఉమెన్. అటు ఉద్యోగాన్ని, ఇటు ఇల్లు, పిల్లల బాధ్యతలను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసే ఇల్లాలు.

Advertisement

ఆమె జీవితం బయట నుంచి చూడడానికి చాలా సంతోషంగా కనిపిస్తుంది. కానీ అంతలోనే కథలో ఒక ఆందోళనకరమైన ట్విస్ట్ వస్తుంది. ఒకరోజు హ్యున్-వూ అనుకోకుండా తన భార్య సూ-యోన్ ఫోన్‌ చూస్తాడు. అందులో ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను చూశాక ఆమె ఈ వీకెండ్ ఒక హోటల్‌ లో మరొక వ్యక్తిని కలవబోతోందని తెలుస్తుంది. కానీ అతను ఈ ఒక్క మెసేజ్ తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను అపార్థం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసి హ్యున్-వూ పూర్తిగా కుంగిపోతాడు. నేరుగా భార్యను అడగలేక, తన స్నేహితులకు చెప్పలేక సతమతమవుతాడు.

ఎలాగైనా తన పెళ్లి బంధాన్ని కాపాడుకోవాలనే ఆశతో, అతను ఒక ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఫోరమ్‌లో అనామక పేరుతో తన సమస్యను పోస్ట్ చేస్తాడు. హ్యున్-వూ పెట్టిన పోస్ట్‌ కు వేలాది మంది నెటిజన్లు స్పందిస్తారు. రకరకాల సలహాలు, సూచనలు ఇస్తారు. కొందరు అతని భార్యను తప్పుబడితే, మరికొందరు ఆమె అలా మారడానికి గల కారణాన్ని వెతకమంటారు. ఈ పోస్ట్ ద్వారా హ్యున్-వూ తన భార్య అడుగుజాడలను కనిపెట్టడం మొదలు పెడతాడు. అంటే ఆమె ఎటు వెళ్ళినా ఓ కంట కనిపెడుతూ ఉంటాడు.

Advertisement

చివరికి వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ ఎలా కలిశారు ? ఆమె బాధ ఏమిటి ? హ్యున్-వూ తన భార్యను తిరిగి గెలుచుకోవడానికి ఏం చేశాడు ? అనే విషయాలను ఎంతో ఎమోషనల్‌గా, కాస్త కామెడీ మిక్స్ చేసి ఈ సిరీస్‌లో చూపించారు. మొత్తం 12 ఎపిసోడ్‌లతో సాగే ఈ వైవాహిక జీవిత బంధాల సిరీస్, నేటి తరం జంటలకు ఒక మంచి మెసేజ్‌ను అందిస్తుంది. ప్రేమను కాపాడుకోవాలంటే ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇందులో చూసి తెలుసుకోవచ్చు. ‘లిజన్ టు లవ్’ (Listen to Love) ప్రస్తుతం Hotstarలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. అలాగే ఒరిజినల్ కొరియన్ వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Netflixలో కూడా చూడవచ్చు.

Read Also: అందం కోసం ఫ్రెండ్స్ చర్మాన్ని ఒలిచే సైకో పిల్ల… తినేటప్పుడు మాత్రం ఈ సినిమాను చూడొద్దు

Tags

Related News

దేవుడిచ్చిన మ్యాజికల్ బుక్‌తో మిడిల్ క్లాస్ మ్యాన్ రచ్చ… తెలుగు మూవీనే

ఓటీటీలో ఈ వారం ఎక్కువ మంది చూసిన టాప్ 10 ఇవే… రష్మిక మూవీని వెనక్కి నెట్టేసిన రియాలిటీ షో

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

రూ. 1185 కోట్ల కలెక్షన్స్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న రాబిన్ హుడ్ చివరి కథ

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

Big Stories

Advertisement
×