E-Paper
Advertisement

చేతబడి తిప్పికొడితే ఎలా ఉంటుందో తెలుసా ? ఓటీటీని వణికిస్తున్న మలయాళం హర్రర్ సిరీస్

చేతబడి తిప్పికొడితే ఎలా ఉంటుందో తెలుసా ? ఓటీటీని వణికిస్తున్న మలయాళం హర్రర్ సిరీస్
Advertisement

Malayalam Horror Thriller Series: హర్రర్ అంటే ఎప్పుడూ దెయ్యాలేనా ? అప్పుడప్పుడు చేతబడి, క్షుద్రపూజలు వంటి అంశాలతో తెరకెక్కే సినిమాలు చూస్తుంటే వచ్చే కిక్కే వేరు. అయితే ఇందులోనూ ఎక్కువగా చేతబడి చేసి అవతలి వాళ్ళను ఇబ్బంది పెట్టడం, చంపడం మాత్రమే చూసి ఉంటారు. కానీ అదే చేతబడి చేసిన వాళ్లకే తిప్పి కొడితే ఎలా ఉంటుంది ? అన్న స్టోరీతో రూపొందిన ఓ మంచి మలయాళం సిరీసే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సిరీస్ పేరు ‘ముత్తశ్శి (Muthassi)’. 2026 జూలై 3 నుంచి ఈ మలయాళ ఫోక్-హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. నందులాల్ ఎం.ఎస్. దర్శకత్వంలో రూపొందిన ఈ 6 ఎపిసోడ్ సిరీస్ ను ఓ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కేరళ-కర్ణాటక సరిహద్దు తులు గ్రామం నేపథ్యంలో సంప్రదాయాలు, క్షుద్రపూజలు, శాపాలు, మాతృత్వం మధ్య జరిగే భయంకరమైన పోరాటం ఈ మూవీ. లీలా ఇందులో మన హీరోయిన్. పెళ్లి చేసుకుని భర్త రాజన్ తో కలిసి అతని పూర్వీకుల గ్రామానికి వస్తుంది. దట్టమైన అడవులు, పాత ఆలయాలు, వింత నమ్మకాలు నిండిన ఆ గ్రామం లీలాకు కొత్తగా అనిపిస్తుంది. రాజన్ పూర్వీకుల ఇల్లు భయంకరంగా ఉంటుంది. అందులోకి అడుగు పెట్టిన తర్వాతనే ఆమెకు వింత అనుభవాలు మొదలవుతాయి.

Advertisement

రాత్రి పూట ఇంటి మూలల్లో ఎవరో తిరుగుతున్నట్లు శబ్దాలు, విచిత్రమైన గాలులు, భయంకరమైన కలలు ఆమెను వెంటాడతాయి. ఇంట్లో రాజన్ తల్లి ముత్తశ్శి ఉంటుంది. ఊరంతా ఆమెను చూస్తేనే వణికిపోతుంది. పచ్చి మాంసం తినడం, మద్యం సేవించడం, వింతగా మాట్లాడడం… ఇదీ ముత్తశ్శి యవ్వారం. ఊరి పెద్దలు ఆమె గతంలో క్షుద్రపూజలు, చేతబడులు చేసి గ్రామాన్ని శపించిందని నమ్ముతారు. రాజన్ తన తల్లిని సాధారణంగా చూపించడానికి ప్రయత్నించినా, లీలాకు మాత్రం ఆమె అంటే భయమే కాదు అనుమానం పెరుగుతూనే ఉంటాయి.

కొంతకాలానికి లీలా గర్భవతి అయి ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. శ్రీకుట్టన్ అని కొడుకుకి పేరు పెట్టుకుంటారు. ముత్తశ్శి ఆ బాబును తన వారసుడిగా చూసుకుంటుంది. బాబు కొంచెం పెద్దయ్యాక అతని ప్రవర్తనలో భయంకరమైన మార్పులు వస్తాయి. పచ్చి మాంసం తినడం, రాత్రి పూట క్రూరంగా అరవడం, కళ్లు విచిత్రంగా మారడం… తన కొడుకుకు ఏదో అయ్యిందని లీలా భయపడిపోతుంది.

Advertisement

ఈ క్రమంలో లీలాకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ముత్తశ్శి గతంలో తన వంశాన్ని కాపాడుకోవడానికి ఒక రాక్షసుడికి బలి ఇచ్చి, భయంకరమైన చేతబడి చేసింది. ఆ శాపం వల్ల శ్రీకుట్టన్ మనిషిలా కాకుండా రాక్షస శక్తి ఉన్న బిడ్డగా పుడతాడు. రాజన్ కూడా ఈ నిజాలన్నీ దాచి లీలాను మోసం చేశాడని తెలుస్తుంది. విషయం తెలిసి ఊరు ఊరంతా ఆ పిల్లాడిని చంపడానికి వస్తారు. మరి లీలా తన కొడుకును తానే చంపిందా ? లేదంటే అంత మంది నుంచి ఎలా తనయుడికి కాపాడుకుంది ? ప్రేమ రాక్షసుడిని కూడా మార్చగలదా? లేదా రక్తంలో దాగి ఉన్న చీకటి ఎప్పటికైనా బయట పడుతుందా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ప్రస్తుతం ZEE5లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మలయాళం, తెలుగు భాషలలొ అందుబాటులో ఉంది.

Read Also : నగరంలో వరుస హత్యలు… పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే సీరియల్ కిల్లర్

Tags

Related News

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Big Stories

Advertisement
×