E-Paper
Advertisement

గ్లామర్ ప్రపంచం వెనుక దాగిన నిజాలు… ఏంజెలీనా జోలీ కొత్త మూవీ

గ్లామర్ ప్రపంచం వెనుక దాగిన నిజాలు… ఏంజెలీనా జోలీ కొత్త మూవీ
Advertisement

Emotional Drama: గ్లామర్ ప్రపంచాన్ని చూస్తే మెరుపులు, ఫ్యాషన్ షోలు, లగ్జరీ జీవితం మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ వెలుగుల వెనుక ఎన్నో కలలు, కష్టాలు, వ్యక్తిగత బాధలు దాగి ఉంటాయి. అలాంటి భావోద్వేగాలను హార్ట్ టచింగ్ గా ఆవిష్కరించే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ‘కూట్యూర్’ (Couture) కూడా అలాంటి చిత్రమే. హాలీవుడ్ స్టార్ అంజెలినా జోలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రెంచ్ డ్రామా, ముగ్గురు మహిళల జీవితాలను ఒకే వేదికపై కలిపి, వారి పోరాటాలను ఎంతో సహజంగా చూపిస్తుంది. ఇది కమర్షియల్ సినిమా కాదు గానీ, జీవితానికి దగ్గరగా అనిపించే ఎమోషనల్ జర్నీ. మరి ఈ మనసుకు హత్తుకునే సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పారిస్ ఫ్యాషన్ వీక్ నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి డిజైనర్లు, మోడల్స్, కళాకారులు ఒకే చోట చేరే ఈ వేడుకలో ముగ్గురు మహిళల జీవితాలు అనుకోకుండా ఒకదానితో ఒకటి ముడిపడతాయి.

Advertisement

వారిలో మాక్సిన్ వాకర్ పాత్రలో ఏంజెలినా జోలీ కనిపిస్తుంది. స్వతంత్ర చిత్రాలను తెరకెక్కించే దర్శకురాలైన ఆమె, ఓ ఫ్యాషన్ హౌస్‌తో కలిసి పని చేసేందుకు పారిస్‌కు వస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాల కోసం అడుగులు వేస్తున్న సమయంలోనే ఆమె జీవితాన్ని కుదిపేసే వార్త తెలుస్తుంది. తనకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిన తర్వాత ఆమె ఎదుర్కొనే మానసిక సంఘర్షణ కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

అదే సమయంలో సౌత్ సూడాన్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని అదా జీవితంలోనూ ఊహించని మార్పు చోటుచేసుకుంటుంది. అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తన ప్రతిభను నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. మరోవైపు ఎంజెల్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఫ్యాషన్ షోల వెనుక కనిపించకుండా కష్టపడుతూ, ఒకరోజు రచయిత్రిగా గుర్తింపు పొందాలనే కలను గుండెల్లో దాచుకుని జీవిస్తుంది.

Advertisement

ఈ ముగ్గురు మహిళలు వేర్వేరు లైఫ్ స్టైల్ నుంచి వచ్చినప్పటికీ, వారి బాధలు మాత్రం ఒకేలా ఉంటాయి. గ్లామర్ ప్రపంచంలో తమ ఉనికిని నిలబెట్టుకోవాలనే తపన, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కలల కోసం చేసే పోరాటం కథను మరింత భావోద్వేగంగా మారుస్తాయి.

ఫ్యాషన్ ప్రపంచం వెలుగుల వెనుక దాగి ఉన్న వాస్తవాలను దర్శకురాలు అలిస్ వినోకర్ ఎంతో సహజంగా చూపించారు. చివరికి ఈ ముగ్గురు మహిళల ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది ? వారు తమ జీవితాల్లో అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారా ? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

‘కూట్యూర్’ పూర్తిగా పాత్రల భావోద్వేగాలపై ఆధారపడిన డ్రామా. హాలీవుడ్ ఏంజిల్స్ ఏంజెలినా జోలీ, అన్యేర్ అనై, ఎల్లా రంప్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకురాలు అలిస్ వినోకర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని కేవలం ఆడంబరంగా కాకుండా, అక్కడ పనిచేసే మనుషుల జీవితాలతో ముడిపెట్టి చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అద్భుతమైన పారిస్ లొకేషన్స్, ఫ్యాషన్ షో విజువల్స్, ఎమోషనల్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

ఈ సినిమా ఆగస్టు 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో మాత్రమే వీక్షించవచ్చు. ఇది ఒక హాలీవుడ్ ఇండిపెండెంట్ డ్రామా కావడంతో తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. యాక్షన్, థ్రిల్లర్‌లు కాకుండా హృదయాన్ని తాకే భావోద్వేగ కథలు చూడాలనుకునే వారి కోసమే ఈ మూవీ.

Read Also: ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Related News

బెడ్‌రూమ్‌లో తీవ్రంగా వేధించే భర్త… కట్ చేస్తే శవంతో చిక్కుల్లో పడే భార్య

మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం

బెడ్‌రూమ్‌లో కూర్చునే 200 కోట్ల చోరీ.. ఒక్క హ్యాక్‌తో ప్రాణాల మీదికి… హై-వోల్టేజ్ సైబర్ థ్రిల్లర్

బంగారం కోసం వచ్చిన దొంగలకు చుక్కలు చూపించే శివంగి… మంచులో సాగే సర్వైవల్ థ్రిల్లర్

గర్భిణీ నరబలి… చేతబడి… వరుస మరణాలు… వరలక్ష్మి శరత్‌కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్

సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

Big Stories

Advertisement
×