Romantic Short Film : కొన్ని కథలు రెండు గంటలు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 20 నిమిషాల్లోనే ప్రేక్షకుల మనసును తాకేలా చెప్పగలుగుతాయి. అలాంటి కథలలో ‘Under the Same Roof’. ఒక ఎమోషన్ తో ఆకట్టుకుంటుంది. 2025లో విడుదలైన ఈ కెనడియన్ షార్ట్ డ్రామాకు డానియెలా రోజో దర్శకత్వం వహించారు. జోయ్ థాంప్సన్, అమారా జేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంటర్నెట్, ఫిల్మ్ ఫెస్టివల్స్ లలో దీనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.
21 ఏళ్ల కియారా (జో థాంప్సన్) లండన్ శివార్లలోని ఒక మధ్యతరగతి కాలనీలో నివసిస్తూ ఉంటుంది. రోజువారీ ఏ మార్పూ లేని ఆ బోరింగ్ జీవితం ఆమెకు అస్సలు నచ్చదు. ఎలాగైనా ఆ వాతావరణం నుండి తప్పించుకోవాలని, జీవితంలో ఏదైనా కొత్తదనం చూడాలని తపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆమెకు నజ్మిన్ (అమర జేన్) అనే ఒక ఆకర్షణీయమైన అమ్మాయి పరిచయమవుతుంది. నజ్మిన్ స్వతంత్ర భావాలు, ఆమె ఆలోచనలు కియారాను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇద్దరూ త్వరగానే మంచి స్నేహితులుగా మారతారు.
ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్న కొద్దీ, కియారాకు నజ్మిన్ పట్ల స్నేహానికి మించిన ఆకర్షణ, ఇష్టం ఏర్పడతాయి. ఒకే ఇంటిలో ఉంటూ కలిసి బతకాలని, ఒక చిన్న తోటను పెంచుకోవాలని ఇద్దరూ కలలు కంటారు. అయితే నజ్మిన్ మాత్రం కియారాను ఒక అబ్బాయితో డేటింగ్‌కు పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంఘటన కియారాను తీవ్రమైన గందరగోళంలోకి నెడుతుంది. తన సొంత లైంగికత ఏంటి? నజ్మిన్‌తో తనకున్న బంధం ఎలాంటిది? అనే ప్రశ్నలను ఎదుర్కొంటూ, తన మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ఆమె పడే వేదనే ఈ షార్ట్ ఫిల్మ్ కథ.
‘Under the Same Roof’లో భారీ ట్విస్టులు ఉండవు. స్నేహం, ప్రేమ, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయాణాన్ని చాలా నేచురల్ గా చూపించారు. నటీనటుల నటన, సైలెంట్ గా సాగే కథనం, ఎమోషన్స్ కు ఇచ్చిన ప్రాధాన్యం ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్స్ ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ సజెషన్. దీనిని youtubeలో ఫ్రీగానే చూడచ్చు.
Read Also : నర్సు కూతురు మిస్సింగ్… సాక్ష్యాలు లేకుండా అఘాయిత్యం… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్