E-Paper
Advertisement

నిషేధిత మాయా విద్యతో ప్రేమ, ప్రతీకారం… ఫాంటసీ లవర్స్ అస్సలు మిస్ కాకూడని కొరియన్ సిరీస్

నిషేధిత మాయా విద్యతో ప్రేమ, ప్రతీకారం… ఫాంటసీ లవర్స్ అస్సలు మిస్ కాకూడని కొరియన్ సిరీస్
Advertisement

Korean Fantasy Series: కొన్ని ఫాంటసీ కథలు కేవలం మ్యాజిక్‌కే పరిమితం కావు. ప్రేమ, ప్రతీకారం, త్యాగం, విధి.. ఇవన్నీ కలిసినప్పుడు అవి మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అలాంటి అరుదైన సిరీస్‌లలో ‘ఆల్కెమీ ఆఫ్ సోల్స్’ (Alchemy of Souls) ఒకటి. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఈ ఫాంటసీ హిస్టారికల్ డ్రామా విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. మంత్రవిద్యలతో నిండిన ఓ కల్పిత రాజ్యం, ఒక నిషేధిత ఆత్మ మార్పిడి విద్య, ఒక హంతకురాలు, తన శక్తులను కోల్పోయిన తర్వాత ప్రారంభమైన కొత్త జీవితం… ఈ కథ మొదలయ్యే విధానం మొదటి నుంచే ప్రేక్షకుడిలో ఆసక్తి పెంచేస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు, ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ కలిసి ‘ఆల్కెమీ ఆఫ్ సోల్స్’ను పాపులర్ కొరియన్ డ్రామాగా నిలబెట్టాయి. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ మొత్తం డేహో అనే కల్పిత రాజ్యంలో సాగుతుంది. అక్కడ మంత్రగాళ్లు ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ జీవిస్తుంటారు. అయితే అందరికీ నిషేధించిన ఒక ప్రమాదకరమైన మంత్రవిద్య ఉంటుంది. అదే ఆల్కెమీ ఆఫ్ సోల్స్. దీని ద్వారా ఒకరి ఆత్మను మరొకరి శరీరంలోకి మార్చవచ్చు. కానీ ఆ శరీరం కొత్త ఆత్మను తట్టుకోలేకపోతే ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.

Advertisement

అలాంటి పరిస్థితుల్లోనే అత్యంత శక్తివంతమైన హంతకురాలు నాక్సు ప్రాణాపాయ స్థితిలో తన ఆత్మను ము-డియోక్ అనే బలహీన యువతి శరీరంలోకి మార్చుకుంటుంది. కానీ ఊహించని విధంగా ఆమె తన మంత్రశక్తులన్నింటినీ కోల్పోతుంది. జీవితాంతం శత్రువులను వణికించిన యోధురాలు ఒక్కసారిగా సాధారణ యువతిగా మారిపోవడం కథకు ఆసక్తికరమైన మలుపు తీసుకొస్తుంది.

ఇదే సమయంలో ప్రముఖ మంత్రగాళ్ల కుటుంబానికి చెందిన జాంగ్ ఉక్ తన జీవితాన్ని మార్చే గురువు కోసం వెతుకుతుంటాడు. అతని పుట్టుక వెనుక ఉన్న రహస్యాల కారణంగా అతని మంత్రశక్తులు చిన్నప్పుడే బందిస్తారు. అందరూ తక్కువగా చూసినా, తన విధిని మార్చుకోవాలనే పట్టుదల మాత్రం అతనిలో తగ్గదు.

Advertisement

నాక్సు ఎవరనేది జాంగ్ ఉక్ గుర్తిస్తాడు. ఇద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం కుదురుతుంది. బయట ప్రపంచానికి ము-డియోక్ అతని పని మనిషిలా కనిపించినా, రహస్యంగా మాత్రం ఆమె అతనికి మంత్రవిద్యలు, యుద్ధ నైపుణ్యాలు నేర్పించే గురువుగా మారుతుంది. గురు-శిష్యులుగా మొదలైన ఈ ప్రయాణం క్రమంగా ప్రేమగా మారుతుంది.

కానీ డేహో రాజ్యంలో దాగి ఉన్న కుట్రలు, అధికార పోరు, నిషేధిత మంత్రవిద్య చుట్టూ తిరిగే ప్రమాదాలు వీరి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి సమస్యను అధిగమిస్తున్న సమయంలో కొత్త శత్రువులు ఎదురవుతుంటారు. నమ్మినవాళ్లే ద్రోహం చేసే పరిస్థితులు కూడా వస్తాయి.

మొదటి భాగం చివర్లో జరిగిన ఒక ఘోర సంఘటనతో మొత్తం కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండో భాగానికి బలమైన పునాది వేస్తాయి. చివరికి నాక్సు తన అసలు జీవితాన్ని తిరిగి పొందిందా? జాంగ్ ఉక్ తన విధిని ఎలా మార్చుకున్నాడు ? డేహో రాజ్యాన్ని చీకటి శక్తుల నుంచి ఎవరు కాపాడారు ? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘ఆల్కెమీ ఆఫ్ సోల్స్’ సిరీస్‌ను పూర్తిగా చూడాల్సిందే.

తెలుగులో అవైలబుల్ గా ఉందా ?

‘ఆల్కెమీ ఆఫ్ సోల్స్’లో మంత్రశక్తులతో నిండిన డేహో రాజ్యాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన నేపథ్యం ఉండటం వల్ల కథ ఎక్కడా బోర్ అనిపించదు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి. ఫాంటసీ ప్రపంచం, మిస్టరీ, రొమాన్స్, యాక్షన్ కలిసిన కథలు కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం 2 సీజన్లు ఉన్నాయి. మొదటి సీజన్‌లో 20 ఎపిసోడ్‌లు, రెండో సీజన్‌లో 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది ఒరిజినల్ కొరియన్ ఆడియోతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఆడియోల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. మొదటి ఎపిసోడ్ నుంచే తన ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ సిరీస్, చివరి వరకు ఆసక్తిని ఏమాత్రం తగ్గనివ్వదు.

Read Also: 10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×