BigTV English

OTT Movie : వేశ్యగా మారిన భార్యతో కాపురం చేసే భర్త… భార్యాభర్తలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : వేశ్యగా మారిన భార్యతో కాపురం చేసే భర్త… భార్యాభర్తలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ లైఫ్ లో జరిగే కొన్ని స్టోరీలను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటారు మేకర్స్. అటువంటి సినిమాలు కొన్ని అరుదుగా వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, రియల్ లైఫ్ లో కూడా ఇటువంటివి జరుగుతుంటాయి కదా అనిపిస్తుంది. అటువంటి ఫీల్ ని తెచ్చే ఒక హాలీవుడ్ రొమాంటిక్ మూవీ, ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘మలినా‘ (Malena). ఈ మూవీని టోర్నాటోర్ రచించి, దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా బెల్లూచి, గియుసేప్ సల్ఫారో నటించారు. ఈ మూవీ 73వ అకాడమీ అవార్డ్స్‌లో, ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఎంపికైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

మలినా ఒంటరిగా ఉంటూ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. ఈమె భర్త మిలిటరీలో డ్యూటీ చేస్తుండటంతో, ఒంటరిగా ఎలా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరినైనా మైంటైన్ చేస్తూ ఉంటుందని, అనుకుంటూ సెటైర్లు వేస్తుంటారు అక్కడ వున్న జనం. ఈ క్రమంలో హీరో ఆమెను చూసి లవ్లో పడతాడు. ఈ కథలో హీరో 15 సంవత్సరాలు పిల్లవాడు. సైకిల్ వేసుకొని మలినాని ఫాలో అవుతూ ఉంటాడు హీరో. ఆమె ఏం చేస్తుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఈ విషయాలు ఇతనికి బాగా తెలుస్తాయి. అయితే ఒక రోజు మలినా భర్త మిలటరీలో చనిపోయాడని వార్త వస్తుంది. ఈ విషయం విని మలినా షాక్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు, ఆమె తండ్రి కూడా చనిపోవడంతో, మలినా జీవితం ఒంటరిదైపోతుంది. ఆమెకు ఒంట్లో బాగలేకపోవడంతో, ఒక డాక్టర్ మెడిసిన్ ఇవ్వడానికి వస్తాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి వచ్చి, మలినా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటూ అతనితో గొడవ పడతాడు. ఈ గొడవ కోర్టు వరకు వెళ్తుంది. అయితే కోర్టులో మలినా తరపున వాదించడానికి ఒక లాయర్ కావాల్సి ఉంటుంది. మలినా దగ్గర డబ్బు లేకపోవడంతో, ఇదే అదను చూసి ఒక లాయర్ డబ్బు బదులు ఇంకోటి ఇవ్వాలని అడుగుతాడు. చేసేదేం లేక హీరోయిన్ అతనితో గడపడానికి ఒప్పుకుంటుంది.

ఇదంతా గమనిస్తున్న హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకు మలినా ఇలా చేస్తుందని బాధపడతాడు. అయితే ఇవన్నీ తప్పని పరిస్థితుల్లో చేస్తుందని రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత తినడానికి ఫుడ్ కూడా లేకపోవడంతో, మలినా ఆ పని చేయడానికి సిద్ధపడుతుంది. అనుకోకుండా ఒక రోజు మలినా భర్త తిరిగి వస్తాడు. ఆమె గురించి అతనికి అందరూ తప్పుగా చెప్తారు. హీరో అక్కడికి వచ్చి అతనికి ఒక లెటర్ పంపుతాడు. ఎవరు ఎన్ని అనుకున్నా మలినా చాలా మంచి అమ్మాయి అంటూ అందులో రాసి ఉండటంతోపాటు, ఆమె అడ్రస్ కూడా అందులో ఉంటుంది. మలినా భర్త ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. చివరికి మలినా తన భర్తతో లైఫ్ని స్టార్ట్ చేస్తుందా? అక్కడ ఉన్న జనం వీళ్ళ గురించి ఏమనుకుంటారు? హీరో మలినా లైఫ్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘మలినా’ (Malena) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×