OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. ఇటువంటి సినిమాలను మిస్ కాకుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఎందుకంటే వీటిని చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది. కళ్ళు చెమ్మగిల్లే ఒక లవ్ స్టోరీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘మీ బిఫోర్ యు‘ (Me before you). ఈ మూవీలో హీరో ఒక రోడ్డు ప్రమాదంలో కుర్చీకి పరిమితం అవుతాడు. అతనికి జీవితం మీద ఆశలు కలిగించడానికి హీరోయిన్ వస్తుంది. వీరిద్దరి మధ్య స్టోరీ చక్కగా ఉంటుంది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
లూయిసా ఒక చిన్న కాఫీ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ షాప్ సరిగ్గా నడవకపోవడంతో ఆ షాపు ఓనర్ కాఫీ షాప్ ని క్లోజ్ చేయాలనుకుంటాడు. అందుకు లూయిసా ను పనిలో నుంచి తీసేస్తారు. తర్వాత కేర్ టేకర్ గా ఒక జాబ్ ఉందని తెలిసి అక్కడికి ఇంటర్వ్యూ కి వెళ్తుంది. అక్కడ విలియమ్స్ ఒక రోడ్డు ప్రమాదంలో కుర్చీకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అతనిని చూసుకోవడానికి కేర్ టేకర్ ఇంటర్వ్యూకి వస్తుంది. విలియమ్స్ తల్లి ఇంటర్వ్యూ చేసి లూయిసా ను సెలెక్ట్ చేస్తుంది. అయితే మొదట విలియమ్స్ ఆమెతో అంత ఎక్కువగా మాట్లాడకుండా ఉంటాడు. రాను రాను ఆమె మాటలు అతన్ని అట్రాక్ట్ చేస్తాయి. లూయిసా ఎప్పుడూ వాగుతూనే ఉంటుంది. ఆ మాటలకి విలియమ్స్ తన బాధలను మర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడూ బయటికి రాని విలియమ్స్, వీల్ చైర్ లో ఆమెతోపాటు బయటికి వస్తాడు. దీనికి విలియమ్స్ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. విలియమ్స్ యాక్సిడెంట్ కి ముందుఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ తో కుర్చీకి పరిమితం అవడంతో అతన్ని వదిలేస్తుంది. హీరోయిన్ కి ఇంట్లో ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేమంటే హీరోకి పెయిన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అందుకు అతను లీగల్ గా ప్రభుత్వం మనుమతితో చనిపోవాలనుకుంటాడు. ఈ విషయం లూయిసాకి తెలిసి చాలా బాధపడుతుంది.
ఇది ఇలా ఉంటే విలియమ్స్ మాజీ గర్ల్ ఫ్రెండ్ తన పెళ్లికి కార్డ్ ఇచ్చి విలియమ్స్ ని పిలుస్తుంది. అప్పుడు హీరో చాలా బాధపడతాడు. యాక్సిడెంట్ కి ముందు తన లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకుంటాడు. లూయిసా, విలియమ్స్ ఆ పెళ్లికి హాజరవుతారు. ఆ తర్వాత లూయిసా విలియమ్స్ తో నువ్వు చనిపోవాలని ఆలోచన మానుకోవాలని బ్రతిమాలుతుంది. అయితే నీతో మాట్లాడుతుంటే ఆ నొప్పిని దాచిపెట్టి పైకి సంతోషంగా ఉంటున్నానని చనిపోవడం తప్పదని చెప్తాడు. లూయిసా ఎంత చెప్పినా వినకపోవడంతో అతనిపై కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. విలియమ్స్ కి ఫైనల్ గా ప్రభుత్వం చనిపోవడానికి అనుమతిస్తుంది. ఇంటికి వచ్చిన లూయిసా కి చివరి రోజుల్లో నువ్వు అతనితో ఉండాలని తండ్రి చెప్పాడు. లూయిసా బాధపడుతూ అతని దగ్గరికి వెళ్తుంది. చనిపోయే ముందు అతని పక్కనే ఉంటుంది. ఆమెను తన కళ్ళల్లోకి చూడమని అలాగే కళ్ళు మూస్తాడు విలియమ్స్. ఒక మంచి మూవీ చూడాలనిపించినప్పుడు ఈ మూవీని గుర్తుపెట్టుకొని తప్పకుండా చూడండి.