BigTV English

OTT Movie : పొరపాటున దారి తప్పే ఫ్యామిలీ… సైకో కిల్లర్స్ చేసే అరాచకం చూస్తే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే

OTT Movie : పొరపాటున దారి తప్పే ఫ్యామిలీ… సైకో కిల్లర్స్ చేసే అరాచకం చూస్తే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే

OTT Movie : హాలీవుడ్ సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతీ సీన్ ఉత్కంఠంగా సాగుతుంది. హింస కూడా ఎక్కువగానే ఉంటుంది.  ఎడారిలో ఒక ఫ్యామిలీ కొంతమంది సైకోల చేతిలో చిక్కుకుంటారు. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

బాబ్, ఎథెల్ దంపతులు, వాళ్ళ పిల్లలు బ్రెండా, బాబీ, లిన్, లిన్ భర్త డౌగ్, వారి బిడ్డ కేథరిన్ అమెరికాలోని నెవాడా ఎడారిలో విహార యాత్రకు బయలుదేరుతారు. వాళ్ళు ఒక వ్యాన్ లో ప్రయాణిస్తూ, ఒక గ్యాస్ స్టేషన్ వద్ద విచిత్రమైన వ్యక్తిని కలుస్తారు. అతని సలహా మేరకు ఈ కుటుంబం ఒక షార్ట్‌కట్ రోడ్డులో వెళ్తారు. కానీ అది వాళ్ళని ఎడారిలోని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్తుంది. అక్కడ వీళ్ళ వ్యాన్ ప్రమాదవశాత్తు దెబ్బతింటుంది. వాళ్ళు ఎడారిలో చిక్కుకుపోతారు. కానీ ఆ ప్రాంతంలో విచిత్రమైన మనుషులు ఉంటారు. ఇక్కడ ఒకప్పుడు అణు పరీక్షలు జరిగిఉంటాయి.ఈ రేడియేషన్ వల్ల ఇక్కడ ఉన్నవాళ్ళ శరీరంలో వికృతంగా మారుతుంది. వీళ్ళను మ్యూటాంట్‌లు అని పిలుస్తుంటారు.


వీళ్ళు ఇప్పుడు మానవ మాంసం తినే రాక్షసులుగా మారిపోయి ఉంటారు. ఈ మ్యూటాంట్‌లు బాబ్ కుటుంబంపై దాడి చేస్తారు. బాబ్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తారు. మిగిలిన కుటుంబ సభ్యులు భయంతో, ప్రాణాలతో బయటపడేందుకు పోరాడాల్సి వస్తుంది. డౌగ్, బాబీ మ్యూటాంట్‌లను ఎదుర్కొని, తమ కుటుంబాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడతారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక రక్తపాతమే జరుగుతుంది.చివరికి ఈ కుటుంబం ప్రాణాలతో బయటపడుతుందా ? మ్యూటాంట్‌లను వీళ్ళు ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : జాబ్ పేరుతో పేద అమ్మాయితో పాడు పనులు… చివరికి వాడికి పట్టే గతి చూస్తే మతి పోవాల్సిందే

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది హిల్స్ హేవ్ ఐస్’ (The Hills Have Eyes). 2006 లో వచ్చిన ఈ మూవీకి అలెగ్జాండ్రే అజా దర్శకత్వం వహించారు. ఇది 1977లో వచ్చిన’ది హిల్స్ హేవ్ ఐస్’ పేరుతో వచ్చిన సినిమాకి రీమేక్ గా వచ్చింది. ఇందులో ఆరోన్ స్టాన్‌ఫోర్డ్, కాథ్లీన్ క్విన్లాన్, వినెస్సా షా, ఎమిలీ డి రావిన్, డాన్ బైర్డ్, రాబర్ట్ జాయ్, టెడ్ లెవిన్ నటించారు. ఎడారిలో నరమాంస భక్షకుల చేతికి చిక్కే ఒక కుటుంబం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ‘ది హిల్స్ హేవ్ ఐస్’2006 మార్చి 10 న యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ థియేటర్‌లలో విడుదలైంది. దీనికి సీక్వెల్ ‘ది హిల్స్ హేవ్ ఐస్ 2’ 2007లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×