BigTV English

Brahmamudi Serial Today June 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామినికి షాక్‌ ఇచ్చిన ఇంద్రాదేవి – రిసార్ట్‌కు బయలుదేరిన కావ్య   

Brahmamudi Serial Today June 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామినికి షాక్‌ ఇచ్చిన ఇంద్రాదేవి – రిసార్ట్‌కు బయలుదేరిన కావ్య   

Brahmamudi serial today Episode: శోభనం గదిలో అప్పు తన ఫోన్‌ తీసుకుని ఎవరితోనో చాట్‌ చేస్తుటే.. కళ్యాణ్‌ తిడతాడు. ఇప్పుడు కూడా చాటింగ్‌ అవసరమా అంటూ సీరియస్‌ కావడంతో అప్పు అలుగుతుంది. ఈ టైంలో అలగడమేంటి అని కళ్యాణ్‌ అడుగుతాడు. నేనింతే కోపం వస్తే అలుగుతాను అంటూ దూరం వెళ్తుంది. దీంతో కళ్యాణ్‌ పాట పాడుతూ అప్పును కూల్‌ చేస్తాడు. మరోవైపు కావ్య రూంలో కొట్టేసిన నగలు తీసుకెళ్లి తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఇస్తాడు రాహుల్‌. నగలు పెట్టుకుని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఈ నగలు ఆ స్వప్న కన్నా నీకే అందంగా ఉన్నాయి బేబీ అంటాడు. నిజమా..? అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. నిజం నువ్వు వేసుకోగానే ఈ నగలకే అందం వచ్చింది అంటాడు రాహుల్‌. దీంతో థాంక్యూ బేబీ అంటుంది. దీంతో రాహుల్‌ ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలసా..? అంటాడు. ఆమె ఎందుకు అని అడగ్గానే.. నువ్వు అడిగినట్టు నీకు ఈరోజు నగలు తీసుకొచ్చాను. అక్కడ మా మమ్మీ కోరుకున్నట్టు కావ్య రాజ్‌ ఇద్దరూ కలవకుండా విడిపోయారు అని చెప్తాడు.


దీంతో ఆమె దానివల్ల మీకు వచ్చే లాభం ఏముంది అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ ఏముంది అని చిన్నగా అడుగుతావేంటి బేబీ.. ఇప్పుడు కనక ఆ రాజ్ యామినిని పెళ్లి చేసుకున్నాడంటే.. దానివల్ల మా ఫ్యామిలీకి ఫర్మినెంట్‌గా దూరం అయిపోయినట్టే.. అని చెప్తాడు. అయితే అని ఆమె అడగ్గానే.. రాజ్యానికి రాజు లేకపోతే సింహాసనం ఖాళీగా ఉంటుంది. కదా..? సింహాసనం ఖాళీగా ఉంటే నాలాంటి సైన్యాధిపతి రాజ్యాన్నే సొంతం చేసుకుని సింహాసనం మీద ఎక్కి కూర్చుంటాడు కదా అని చెప్పగానే  ఆమె నువ్వేమో సింహాసనం ఎక్కి రాజువై పోతావు. నిన్ను నమ్ముకున్నందుకు నాకేమో ముష్టి ఈ నగలేనా..? అంటూ తిడుతుంది.

దీంతో రాహుల్‌ ఆస్థి రాగానే.. నా భార్యకు విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. దీంతో నిన్ను నేను నమ్మను కానీ నాకు ఇప్పుడు విల్లా కావాలి కొనివ్వు అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ షాక్‌ అవుతాడు. మరోవైపు అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ కలిసి కావ్యను పిలిచి యామిని ఏదో డ్రామాలు ఆడుతుందని రాజ్‌ను ఈరోజు రిసార్ట్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అయిందని చెప్తారు. అది ప్లాన్‌ చేస్తే మాత్రం ఆయన వెళ్లాలి కద అమ్మమ్మ. దానితో పెళ్లి పనులకే తిరగని ఆయన ఇంక రిసార్ట్‌కు ఏం వెళ్తారు. కచ్చితంగా వెళ్లరు  అంటుంది కావ్య. దీంతో అపర్ణ లేదు కావ్య రాజ్‌ వెళ్తున్నాడట అని చెప్తుంది. దీంతో కావ్య ఏంటి అత్తయ్య మీరు చెప్పేది అని అడుగుతుంది. దీంతో అపర్ణ.. అవునమ్మా.. ఆ యామిని ఆడింది డ్రామా అని తెలియక.. నా కొడుకు దానికి మాట ఇచ్చాడంట అంటుంది. వీడో పెద్ద హరిశ్చంద్రుడిలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి దానితో పాటు వెళ్తున్నాడట. పొరపాటున వాడు కానీ ఏదైనా తప్పు చేశాడంటే ఇక నీ జీవితం నాశనం అయిపోతుంది కావ్య అంటూ ఇంద్రాదేవి భయపడుతుంది.


దీంతో ముగ్గురు కలిసి యామినికి తెలియకుండా కావ్య ఫాలో చేయాలని దానికి తెలియకుండా రాజ్‌ పక్కన ఉంటూనే యామినిని దెబ్బ కొట్టాలని ప్లాన్‌ చేస్తారు. కావ్య కూడా రిసార్ట్‌కు బయలుదేరుతుంది. మరోవైపు యామిని బట్టలు సర్దుతుంటే వైదేహి వస్తుంది. ఎందుకు మమ్మీ అలా ఉన్నావు.. అని అడుగుతుంది. దీంతో వైదేహి నాకు ఎందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుంది బేబీ అంటుంది. దీంతో యామిని ఏంటి తప్పు నేనేం పరాయి మగాడితో వెల్లడం లేదు కదా..? నా మెడలో తాళి కట్టబోయేవాడితోనే కదా వెల్తుంది అంటుంది. కరెక్టే అనుకో కానీ పెళ్లికి ముందే ఇలా తొందరపడితే నలుగురు ఏమనుకుంటారు..? అంటుంది. దీంతో యామిని మమ్మీ నాకు నలుగురి కన్నా నాకు నా లైఫే ముఖ్యం. నాకు రాజ్‌ అంటే ప్రాణం. తనను సొంతం చేసుకోవడానికి నేనేమైనా చేస్తాను. నా రాజ్‌ నా సొంతం అవడానికి ఇంతకంటే మంచి ఐడియా ఉంటే చెప్పు ఈ ట్రిప్‌ ను ఇప్పుడే క్యాన్సిల్‌ చేస్తాను.. ఇంతకీ రాజ్‌ ఎక్కడ అని అడుగుతుంది.

మరోవైపు ఇంద్రాదేవి  రాజ్‌ కు ఫోన్‌ చేసి కావ్యనే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నాను అంటుంది. దీంతో రాజ్‌ హ్యాపీగా ఏంటి నాన్నామ్మ నువ్వు చెప్పేది కళావతి గారిని రిసార్ట్‌ కు పంపిస్తున్నావా..? అని అడుగుతాడు. దీంతో ఇంద్రాదేవి మరేం చేయనురా… ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు నిన్ను నా మనవరాలిని ఒక్కటి చేస్తానని మాటిచ్చాను కదా..? అదే చేస్తున్నాను. అని చెప్పగానే.. రాజ్‌ మరింత హ్యాపీగా ఇంద్రాదేవిని మెచ్చుకుంటాడు. ఇంతలో యామిని రావడంతో ఇద్దరూ కలిసి రిసార్ట్‌ కు బయలుదేరుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×