OTT Movie : సైకో కిల్లర్ సినిమాలను ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు మూవీ లవర్స్. ఇందులో వచ్చే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కొంతమంది నరమాంసభక్షకుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ చేతికి ఎవరైనా దొరికితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. చివరివరకూ ఈ సినిమా టెన్షన్ పెట్టి చంపేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ న్యూ మెక్సికో ఎడారిలో ‘సెక్టర్ 16’ అనే సైనిక స్థావరంలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం గతంలో న్యూక్లియర్ టెస్టింగ్ కోసం ఉపయోగించబడింది. దీని వల్ల అక్కడ నివసించే మ్యూటెంట్‌లు శారీరకంగా వికృతంగా మారతారు. సినిమా ప్రారంభంలో ఒక స్త్రీని మ్యూటెంట్‌లు బందీగా పట్టుకుని, వారి జనాభాను పెంచడానికి బలవంతంగా గర్భం దాల్చేలా చేస్తారు. ఆ తరువాత ఆమె ఒక డెడ్ బేబీకి జన్మనిస్తుంది. అందువల్ల మ్యూటెంట్ నాయకుడు పాపా హేడెస్ ఆమెను దారుణంగా చంపేస్తాడు. అదే సమయంలో, యు.ఎస్. నేషనల్ గార్డ్ ట్రైనీల బృందం సెక్టర్ 16లో శాస్త్రవేత్తలకు సామాగ్రిని సరఫరా చేయడానికి వెళ్తుంటారు. ఈ శాస్త్రవేత్తలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కోసం ఒక రహస్య సర్వైలెన్స్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంటారు. సైనికులు మ్యూటెంట్‌లు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు.
అక్కడ గతంలో శాస్త్రవేత్తలు మ్యూటెంట్‌లచే దాడి చేయబడి చంపబడ్డారని తెలుసుకుంటారు. అయితే ఈ సైనికులు తెలియకుండానే మ్యూటెంట్‌ల ట్రాప్‌లో చిక్కుకుంటారు. పురుషులను చంపి, స్త్రీలను సంతానోత్పత్తి కోసం బందీగా తీసుకోవడానికి పథకం వేస్తారు.ఒక్కొక్కరుగా నేషనల్ గార్డ్ సైనికులు మ్యూటెంట్‌ల దాడులకు గురవుతారు. దాడులలో అనుభవం లేని కారణంగా సైనికులు ప్రాణాలను కోల్పోతుంటారు. చివరికి మ్యూటెంట్‌ల చేతిలో ఎంతమంది బలవుతారు ? సైనికులు వీళ్ళని అడ్డుకోగలుగుతారా ? బంధించిన మహిళల్ని ఎవరైనా కాపాడుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పొరపాటున దారి తప్పే ఫ్యామిలీ… సైకో కిల్లర్స్ చేసే అరాచకం చూస్తే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ మూవీ పేరు ‘ది హిల్స్ హేవ్ ఐస్ 2’ (The Hills Have Eyes 2). 2007 లో ఈ మూవీ విడుదలైంది. ఇది 2006 లో విడుదలైన ‘ది హిల్స్ హేవ్ ఐస్’ (The Hills Have Eyes) కి సీక్వెల్ గా వచ్చింది. ఈ మూవీకి మార్టిన్ వీజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ న్యూ మెక్సికో ఎడారిలో నివసించే మ్యూటెంట్‌లకు వ్యతిరేకంగా పోరాడే యు.ఎస్. నేషనల్ గార్డ్ సైనికుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతోంది.