Thriller Movie OTT : ఓటిటి సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక సినీ దర్శక నిర్మాతలు కూడా ఓటిటిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి జానర్ లో వచ్చిన సినిమా ఓటిటిలో ప్రత్యక్షమవుతుంది.. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఓటీటీలోని రిలీజ్ అవుతూ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. మలయాళ సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఆ మూవీలు తెలుగులో రిలీజ్ అవుతుంటే మాత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడా స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
మలయాళ రొమాంటిక్ మూవీ.. ఈ మూవీ కమెడియన్ అల్తాఫ్ సలీమ్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ మందాకిని తెలుగులోకి వచ్చింది. గురువారం ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మూవీ ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ అవుతోన్న విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. మందాకిని మూవీకి వినోద్ లీలా దర్శకత్వం వహించాడు.. రివెంజ్ డ్రామా స్టోరీ రా ఈ మూవీ తెరకెక్కింది. గత ఏడాది మే నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ కోటి లోపల బడ్జెట్ తో నిర్మించబడింది. ఇటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కోటి రూపాయలు లోపల అతనికి ఇక్కడ ఏ మూవీ మూడు కోట్లకు పైగా వసూలు చేయడం మామూలు విషయం కాదు..
స్టోరీ విషయానికొస్తే..
అరోమల్ , అంబిలికి పెద్ధలు పెళ్లి జరిపిస్తారు. ఫస్ట్ నైట్ రోజు అరోమల్ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి అతడి చేత సీక్రెట్‌గా తాగించాలని ప్లాన్ చేస్తారు. అనుకోకుండా మద్యం కలిపిన కూల్ డ్రింక్‌ను తన భార్య అంబిలి తాగేస్తుంది. ఈమధ్య మత్తులో భర్త దగ్గర తన పెళ్లికి ముందు కొనసాగించిన సీక్రెట్ ఎఫైర్ గురించి బయటపెడుతుంది. సుజీత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను వంచించాడనే నిజం బయటపెడుతుంది. అంబిలి లవ్ ఎఫైర్ గురించి ఫస్ట్ నైట్ రోజే బయటపడటంతో అరోమల్ ఏం చేశాడు?. తన భార్యను మోసం చేసిన వ్యక్తిని ఏం చేస్తాడు? అతని ఫ్యామిలీ సుజిత్ పై ఎలాంటి ప్రతీకారాన్ని తీర్చుకుంది అన్నది ఈ మూవీ స్టోరీ. భార్యపై ప్రేమతోనే ఈ సినిమా మొత్తం రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది. మందాకిని మూవీలో మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ 2018 దర్శకుడు జూడ్ అంథోనీ జోసఫ్‌తో పాటు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ కూడా నటించారు.. వీరి పాత్రలు మూవీకి హైలెట్ గా నిలుస్తుంది. థియేటర్లలో బాగా ఆకట్టుకున్న మూవీ మరి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి..