BigTV English
Advertisement

Salman Khan: చుట్టూ సెక్యూరిటీతో తిరగాల్సొస్తుంది.. లారెన్స్ బిష్ణోయ్ హత్యా బెదిరింపులపై సల్మాన్ స్పందన

Salman Khan: చుట్టూ సెక్యూరిటీతో తిరగాల్సొస్తుంది.. లారెన్స్ బిష్ణోయ్ హత్యా బెదిరింపులపై సల్మాన్ స్పందన

Salman Khan: మామూలుగా సినీ సెలబ్రిటీల చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటారు. కానీ బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ ఉండే సెక్యూరిటీ మాత్రం అంతా ఇంతా కాదు. సల్మాన్ నిరంతరం ఫుల్ సెక్యూరిటీ మధ్య తిరగడానికి ఒక కారణం ఉంది. అదే లారెన్స్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ అనే అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో కొంతమందిని హత్య కూడా చేశాడు. అప్పటినుండి సల్మాన్‌లో మరింత భయం పెరిగింది. దాంతో పాటు సెక్యూరిటీ కూడా పెరిగింది. ఇక తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సల్మాన్.. మొదటిసారి లారెన్స్ బిష్ణోయ్ నుండి ఎదుర్కుంటున్న హత్యా బెదిరింపులపై స్పందించాడు.


క్లోజ్ ఫ్రెండ్ హత్య

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి సల్మాన్ ఖాన్‌కు వరుస కమిట్మెంట్స్ ఉండడం ఖాయం. దాని వల్లే తను తరచుగా షూటింగ్స్‌కు, ప్రమోషన్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) నుండి హత్యా బెదిరింపులు వస్తుండడంతో తన సెక్యూరిటీని భారీగా పెంచేశాడు ఈ హీరో. ఎక్కడికి వెళ్లాలన్నా పదేపదే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కొన్నిరోజుల క్రితం సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బాబా సిద్ధికీని హత్య చేయించాడు బిష్ణోయ్. అప్పటినుండి తన తరువాతి టార్గెట్ సల్మానే అని అర్థమయ్యింది. తాజాగా ‘సికందర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సల్మాన్ ఖాన్.. ఈ విషయంపై మాట్లాడాడు.


అదే సమస్య

‘‘దేవుడు అనేవాడు అంతా చూస్తూనే ఉంటాడు. మన రాతలో ఎంత వయసు రాసిపెట్టుంటే అంతే బ్రతుకుతాం అంతే. కొన్నిసార్లు ఇంతమందిని వెంటపెట్టుకొని వెళ్లడం మాత్రమే ఇప్పుడు సమస్యగా అనిపిస్తోంది’’ అంటూ పెరిగిన సెక్యూరిటీ వల్ల తను ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్. కొన్నాళ్ల క్రితం సల్మాన్‌పై కూడా హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరు దుండగులు తన ఇంటి వద్దకు వచ్చి గన్‌తో కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఈ హీరోకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ అప్పటినుండి హీరో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. తనకు ఎప్పుడు, ఏం జరుగుతుందా అని భయం మొదలయ్యింది.

Also Read: అట్లీని వదిలేసి ‘అమరన్’ను లైన్‌లో పెట్టిన సల్మాన్ ఖాన్

అక్కడే మొదలు

‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు సల్మాన్ ఖాన్ (Lawrence Bishnoi). బిష్ణోయ్ కమ్యూనిటీ మొత్తం కృష్ణజింకను దేవుడి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. అందుకే అప్పటినుండి సల్మాన్ ఖాన్ వారికి మెయిన్ టార్గెట్ అయ్యాడు. ఒకవైపు ఈ విషయంలో తనపై కేసు కూడా నమోదయ్యింది. దాదాపు 20 ఏళ్ల పాటు కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఒకసారి కోర్టు హియరింగ్‌కు వచ్చిన సమయంలో కూడా సల్మాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ హత్యా ప్రయత్నం చేయించాడు. అంతే కాకుండా పలుమార్లు ఓపెన్‌గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. సల్మాన్ ఖాన్‌ను కచ్చితంగా హత్య చేశాను, అప్పుడు నేనేంటో అందరికీ తెలుస్తుంది అంటూ బెదిరించాడు బిష్ణోయ్.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×