Indian Railways: అత్యతవసరంగా ప్రయాణం చేయాల్సిన వారి కోసం భారతీయ రైల్వే సంస్థ తీసుకొచ్చిన సర్వీస్, తత్కాల్ టికెట్ బుకింగ్. ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఈ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికోసం ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో బుకింగ్ అనేది అంత ఈజీ కాదు. నిమిషాల వ్యవవధిలోనే టికెట్ల బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేసినా టికెట్ పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సో, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తత్కాల్ టికెట్ బుకింగ్ లో చేసే 10 కామన్ తప్పులు
1.బుకింగ్ ఆలస్యంగా మొదలుపెట్టడం
సాధారణంగా తత్కాల్ టికెట్ ఏసీ క్లాస్ కోసం ప్రయాణానికి ఒక్కరోజు ముందు ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. స్లీపర్ క్లాస్ కు 11 గంటల నుంచి మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బుకింగ్ ప్రక్రియను లేట్ చేయకూడదు. బుకింగ్ విండో ఓపెన్ చేయడానికి కనీసం పావుగంట ముందే లాగిన్ కావాలి. వెంటనే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
2.మాన్యువల్‌గా ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేయడం
తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు సమయం చాలా ముఖ్యమైనది. బుకింగ్ లో ప్రయాణీకుల వివరాలను మాన్యువల్ గా ఎంటర్ చేయడం వల్ల టైమ వేస్ట్ అవుతుంది. ప్రయాణీకుల వివరాలను ముందుగానే సేవ్ చేయడానికి IRCTC పోర్టల్ లోని ప్యాసింజర్ మాస్టర్ లిస్ట్ ఫీచర్ ను ఉపయోగించుకోవాలి. ఇది తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సమాచారాన్ని ఆటో ఫిల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
3.మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం
తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అనేది సహకరించాలి. మంచి నెట్ సౌకర్యం ఉండేలా చేసుకోవాలి. లేదంటే బుకింగ్ ఆలస్యమై టికెట్లు దొరకవు. అందుకే వైఫై ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.
4.వేగవంతమైన పేమెంట్స్
తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో పేమెట్స్ ఎంత వేగంగా చేస్తే అంత మంచిది. మీ బ్రౌజర్ లో సేఫ్ గా సేవ్ చేయబడిన UPI, ఇ-వాలెట్లు, IRCTC వ్యాలెట్ ద్వారా త్వరగా పేమెంట్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
5.తత్కాల్ కోటా రూల్స్ పాటించాలి
ప్రతి రైలులో పరిమిత తత్కాల్ కోటా ఉంటుంది. కొంతమంది ప్రయాణీకులు అందుబాటులో ఉన్న కోటాను మించి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా ముందుగానే టికెట్ల లభ్యతను చెక్ చేసుకోని, దానికి అనుగుణంగా బుక్ చేసుకోవాలి. .
6.తప్పుగా బుకింగ్ ఆప్షన్
కొన్నిసార్లు వినియోగదారులు తత్కాల్ కు బదులుగా సాధారణ కోటా కింద టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. అలాంటి పొరపాటు జరగకుండా సరైన బుకింగ్ ఆప్షన్ ను ఎంచుకున్నారో? లేదో? ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
7.ఒకేసారి పలు డివైజ్ ల నుంచి ట్రై చేయండి
తత్కాల్ టికెట్లను పొందేందుకు ఒకేసారి రెండు, మూడు డివైజ్ ల నుంచి ట్రై చేయాలి. ఏదో ఒకదాంట్లో టికెట్లు బుకింగ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
8.ముందుగానే రైలు వివరాలను తెలుసుకోండి
తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్లు ముందుగానే రైలు వివరాలను పరిశీలించాలి. రైలు షెడ్యూల్, సీట్ల లభ్యత, టికెట్ ఛార్జీలను తనిఖీ చేయాలి. మీరు త్వరగా బుక్ చేసుకోగలిగేలా మీ రైలు, రూట్, క్లాస్ త్వరగా ఎంచుకోవాలి.
9.సేఫ్ ఆటోఫిల్ ఆప్షన్
చాలా మంది వినియోగదారులు థర్డ్ పార్టీ బ్రౌజర్, ఆటోఫిల్ స్క్రిప్ట్ లను ఉపయోగిస్తారు. అలా కాకుండా సురక్షితమైన IRCTC విధానాలను ఉపయోగించుకోవాలి.
10.బ్యాకప్ ప్లాన్ లేకపోవడం
తత్కాల్ టికెట్ లభించకపోతే ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ను చూసుకోవాలి. వేర్వేరు రైళ్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవడం, వెయిటింగ్ లిస్ట్ ను ఉపయోగించడం లాంటి ఇతర పద్దతులను ఉపయోగించుకోవాలి.
Read Also: కన్ఫర్మ్ ట్రైన్ టికెట్ కావాలా? సింఫుల్ గా ఈ 5 టిప్స్ పాటించండి!