Gundeninda GudiGantalu Today episode july 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. విజ్జితో రోహిణి మరో ప్లాన్ గురించి చెప్తుంది. మాణిక్యాన్ని ఒకసారి పిలువు ఆయనకు మొత్తం చెప్పి నాన్న మేటర్ ని క్లోజ్ చేద్దామని రోహిణి అంటుంది. మటన్ మాణిక్యం ఇంటికి రాగానే హడావిడి చేస్తాడు. బాలు ఆయనతో ఒక ఆట ఆడుకుంటాడు. ఏమైందండీ ఎందుకట హడావిడి చేస్తున్నారంటే రోహిణి వాళ్ళ నాన్నను పార్ట్నర్స్ మోసం చేసి కోట్లు దోచుకున్నారు. మేక కూడా హాని కలిగించని ఆయనను తన పార్టనర్స్ డబ్బులు లాగేసుకుని జైలుకు పంపించారు అని చెప్తాడు. ఆ మాట వినగానే రోహిణి కెవ్వుమని అరుస్తుంది. ఆస్తులు కూడా రావు ఆయన వచ్చేంతవరకు అని మాణిక్యం చెప్పడంతో ప్రభావతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.. సత్యం మనిషి జైల్లో ఉంటే ఆస్తులు అంటావేంటి అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు. అది కాదండి ఆయనకు కూతురైన అల్లుడైన వీళ్ళే కదా.. దగ్గరుండి ఆయన ఆస్తులు విడిపించాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది కదా.. మొత్తానికి రోహిణి ఆస్తులు పోయాయని ప్రభావతి షాక్ లో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి అత్త గండం నుంచి సేఫ్ గా బయట పడుతుంది. ఇక హ్యాపిగా ఉండొచ్చు అని అనుకుంటుంది. కానీరోహిణి దగ్గరికి దినేష్ వెళ్తాడు. నా భార్య పిల్లలు దూరం అవడానికి కారణం నువ్వే.. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక లక్ష రూపాయలు డబ్బులు అవసరం అవుతాయి. నువ్వు ఇస్తే ఓకే లేదంటే నీ గుట్టు మీ ఇంట్లో వాళ్లకి తెలిసేలా చేస్తాను కళ్యాణి అని అంటాడు. అప్పుడే పార్లర్ కి మనోజ్ రావడం చూసి రోహిణి అలాగే ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది. రోహిణి దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి కెనడాకు వెళ్లడానికి అని అడుగుతాడు. మాట వినగానే రోహిణి సీరియస్ అయ్యి మీ అమ్మానాన్న అడుగు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు ఇస్తారు అని సలహా ఇస్తుంది. అనూస్ ఇంటికి రాగానే సత్యం ను ప్రభావతిని ఆ విషయాన్ని అడగడాలని అనుకుంటాడు. బాలు మనోజ్ పై సెటైర్లు వేస్తాడు.
నేను కెనడాకు వెళ్లి బాగా సంపాదించాలి ఉన్న డబ్బులకి పోయిన డబ్బులు అన్ని కలిపి వడ్డీతో సహా పంపిస్తాను అనే మనోజ్ అంటాడు. ఈ సత్యం మాత్రం అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా అని అడుగుతాడు. మేటర్ అంటే అర్థమయిపోయింది నాన్న అని బాలు సెటిల్ వేస్తారు బాలు.. నేను కెనడా కి వెళ్లాలంటే 14 లక్షలు కావాలి. అది మీరు ఇస్తానంటే నేను వెళ్ళిన తర్వాత మొత్తం డబ్బుల్ని పంపించేస్తాను ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మనోజ్ అంటాడు.
ఇప్పటికే నీ చదువుల కోసం చాలా అప్పులు చేశాను వాటిని తీర్చడానికే నా జీవితం జీతం మొత్తం ఖర్చయిపోయాయి. ఇకముందు ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను ఏదో ఒక జాబ్ చూసుకుని సత్యం అంటాడు.. అయినా నీకు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడ ఏముందిరా అని ప్రభావతి అడుగుతుంది.. ఇంటికి తాకట్టు పెట్టిన అక్క డబ్బులు ఇవ్వండి నేను మళ్ళీ తిరిగి తీసిస్తాను అని మనోజ్ అంటాడు. మాట వినగానే సీరియస్ అయిన ప్రభావతి. ఇంటిని పెట్టి నీకు డబ్బులు ఇచ్చి మేము రోడ్డుని పడాల అని అంటుంది..
ఆ మాట వినగానే బాలు ఇది కలా నిజమా అని అంటాడు. వీరికైతే డబ్బులు తెచ్చి కారు కొనిచ్చారు కదా అని అడుగుతాడు. ఆయన ఏ పరిస్థితుల్లో కారణంగా మీకు తెలుసు అందుకే ఇచ్చారు అని మీనా అంటుంది. ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని మీనా అంటే.. మనోజు సీరియస్ గా మీనా పై అరుస్తాడు. ఇక్కడే ఉండి నీలాగా పూలు అమ్ముకోమంటావా అని అంటాడు. నా డిగ్రీ గురించి చెప్తే నీకు నోరు కూడా తిరగదు అని మనోజ్ అంటాడు.
అవును నిజమే నాకు మీ చదివిన డిగ్రీలు చెప్పడానికి నోరు రాదు అని మీనా అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ డబ్బులు ఇవ్వండి అమ్మ అని మనోజ్ బ్రతిమిలాడతాడు. అప్పుడే వచ్చిన రోహిణి ఏమైంది మనోజ్ ఏం జరుగుతుంది అని అంటే.. మీ ఆయనకు డబ్బులు కావాలంట ఇంటి తాకట్టు పెట్టి ఇవ్వాలంట అని ప్రభావతి అంటుంది. ఇవ్వచ్చు కదా అత్తయ్య నోరు చాచి అడిగాడు కదా అని రోహిణి అంటుంది. ఆ డబ్బులు ఏదో మీ నాన్న దగ్గరికి వెళ్లి తెచ్చివ్వని ప్రభావతి అంటుంది. ఇప్పుడు మా నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా ఎలా అడుగుతున్నారు అని అంటుంది.
మీ నాన్న బయటికి వచ్చిన తర్వాత వాడికి డబ్బులు ఇవ్వండి వాడు కెనడా వెళ్లి సంపాదించి ఇస్తాడు అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది.. బాలు ట్రిప్ వస్తే ఇతని తీసుకొని వెళ్తారు. ఏమైందండీ టెన్షన్ పడుతున్నారు అంటే నా పర్సు అందులో మనీ నగలు చాలా ఉన్నాయి. అది ఇక్కడ మర్చిపోయాను అందుకే టెన్షన్ గా ఉందని ఒక ఆవిడ చెప్తుంది. నిజాయితీగా సంపాదించింది అయితే ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది అని బాలు అంటాడు.
శృతి ఉన్న డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లి ఇక్కడ నా పర్సు పెట్టి వెళ్లాను ఎవరైనా తీసారా అని అడుగుతుంది. మీ కన్నా ముందు ఒక అమ్మాయి డబ్బింగ్ చెప్పి వెళ్ళింది అంటాడు సౌండ్ ఇంజనీర్.. కచ్చితంగా ఆ అమ్మాయి పరిస్థితి తీసుకుంటుందని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా శృతి దగ్గరికి వెళ్తారు.శృతి నీ దొంగ అంటూ అవమానిస్తారు. వాయిస్ లాగే ఉంది అని లోపలికి వెళ్తాడు. శృతిని దొంగ అనడం సహించలేక పోతాడు.
వాళ్ళు ఎంత చెప్పినా సరే శృతిని దొంగ అంటూ శృతి బ్యాగును వెతకడానికి ప్రయత్నం చేస్తారు. బాలు చెప్పడంతో శృతి బ్యాగ్ ని చూపించడానికి ఒప్పుకుంటుంది. ఇందులో పర్సు లేకపోవడంతో మరి ఎవరు తీసారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లోపలికి వెళ్లి చూడండి వీళ్ళు నన్ను దొంగ అంటున్నారు అని అడుగుతుంది. నీ పర్సలంటే 100 పర్సులు ఆ అమ్మాయి నీ మొహం పడేయగలదు మాటలు మర్యాదగా రానివ్వండి అని బాలు అంటాడు.
Also Read :శుక్రవారం టీవీ మూవీస్.. ఆ రెండు మిస్ చెయ్యకండి..
ఇదంతా కాదు అసలు మీకన్నా ముందు ఎవరొచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి అని లోపలికి వెళ్తారు. అక్కడున్న సౌండ్ ఇంజనీర్ని శ్రుతి కన్నా ఎవరు ముందు వచ్చారో చెప్పండి అని అడుగుతాడు బాలు. ఒకటి అబ్బాయి వచ్చాడు లోపల పెట్టమని చెప్పాను అని అంటాడు. కచ్చితంగా వాడే తీసుకుని ఉంటాడు అని బాలు వాళ్ళు వాడి దగ్గరికి వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఏం జరుగుతుందో చూడాలి..