Political Thriller: భారతదేశం ఆర్థికంగా దివాళా అంచున నిలబడిన క్షణం… బ్యాంకుల్లో డబ్బు లేదు, విదేశీ మారక నిల్వలు సున్నా… ప్రపంచం మొత్తం భారత్‌ను దివాళా తీసిన దేశంగా చూడడానికి సిద్ధంగా ఉన్న తరుణం… అలాంటి టైమ్ లో సైలెంట్ గా దేశాన్ని కాపాడిన ఒక రియల్ సీక్రెట్ సూపర్ హీరో కథే ‘గవర్నర్: ది సైలెంట్ సేవియర్’ (Governor: The Silent Saviour). మరి ఇంతకీ ఆ రియల్ హీరో ఎవరు ? ఇందులో ఉన్న ఆ నిజమైన స్టోరీ ఏంటి ? సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
1990 – 1991 కాలంలో భారతదేశం ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఆర్థిక సంక్షోభం, దానికి సంబంధించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల భారతదేశ విదేశీ మారక నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయి, దేశం దివాలా తీసే ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. ఇటువంటి అత్యంత క్లిష్ట సమయంలో ఏ. రమణన్ (మనోజ్ బాజ్‌పాయ్) ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
దేశాన్ని ఆర్థిక పతనం నుండి గట్టెక్కించడానికి రమణన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి రుణం తీసుకోవాలి అనుకుంటారు, అందుకోసం కోసం ఒక సీక్రెట్ మిషన్ ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా దేశ రక్షణ కోసం 67 టన్నుల బంగారు నిల్వలను తాకట్టు పెట్టడం వంటి అనేక కఠినమైన, అడ్వెంచర్ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ప్రయాణంలో ఆయనకు ప్రభుత్వాల నుండి తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి. అంతేకాదు ప్రజల ఆగ్రహావేశాలకు కూడా గురవుతారు.
నేను ఫెయిల్ అయితే, దేశమే విఫలమవుతుంది అనే భారీ బాధ్యతను భుజాన వేసుకుని, సైలెంట్‌గా తెరవెనుక ఉండి ఒక సామాన్య బ్యూరోక్రాట్ దేశాన్ని ఎలా కాపాడాడు ? 1991 ఆర్థిక సంక్షోభంలో ఒక గవర్నర్ దేశాన్ని ఎలా కాపాడాడు? ఇంతకీ దేశాన్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడు ? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ ఫైనాన్షియల్ డ్రామా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఫైనాన్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గవర్నర్ ది సైలెంట్ సేవియర్’ (Governor The Silent Saviour 2026). జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో 1991 ఆర్థిక సంక్షోభం గురించి చూస్తే… ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. సినిమాను చూడాలంటే… రూ. 349 చెల్లించి రెంట్ కి తీసుకోవాలి. తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దీనికి దర్శకత్వం వహించారు.
Read Also: అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు