BigTV English

Ghaati OTT : అనుష్క ‘ఘాటి’ కి రికార్డు స్థాయిలో డిజిటల్ హక్కుల అమ్మకాలు.. స్ట్రీమింగ్ అందులోనే..?

Ghaati OTT : అనుష్క ‘ఘాటి’ కి రికార్డు స్థాయిలో డిజిటల్ హక్కుల అమ్మకాలు.. స్ట్రీమింగ్ అందులోనే..?

Ghaati OTT : టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె నటిస్తున్న మూవీనే ‘ఘాటి’.. గతకొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా అనుష్క ఈ మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.. మరి ఆ వివరాలను చూస్తే..


అనుష్క ‘ఘాటి ‘ వచ్చేది అందులోకే.. 

అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ఘాటి.. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. తాజాగా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. సౌత్ ఇండియాలో ఏ వుమెన్ సెంట్రిక్ సినిమాకు గతంలో ఇంత రేటు రాకపోవడం గమనార్హం. చాలా కాలంగా పెద్దగా సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఘాటికి దక్కిన ఓటీటీ ధర చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఘాటి మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సమాచారం..


‘ఘాటి’ మూవీలో అనుష్క రోల్.. 

గతంలో జేజేమ్మ పాత్రలో నటించిన అనుష్క ఇప్పుడు ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. అనుష్క శెట్టి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. తెలుగులో ఆమె చివరి మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అనుష్క 40 ఏళ్ల మహిళగా, సరోగసీని ఎంచుకుని పెద్ద సమస్యల్లో చిక్కుకునే బోల్డ్ పాత్రను పోషించింది.. కానీ ఈ మూవీలో మాత్రం ఆమె అచ్చమైన గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మూవీని కూడా క్రిష్ డైరెక్ట్ చేశాడు. అయితే కొంతభాగం పూర్తయిన తర్వాత అతను తప్పుకున్నాడు.. ప్రస్తుతం ఘాటి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ మూవీకి ఏకంగా రూ.45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.. ప్రీరిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..రూ.12 కోట్లుగా ఉంది. మూవీకి ఏమాత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. ఈ మొత్తాన్ని సులువుగా వసూలు చేస్తుంది.. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితే అనుష్క కమ్ బ్యాక్ ఇచ్చినట్లే. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×