BigTV English

Mathuvadalara 2: ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!

Mathuvadalara 2:  ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!

Mathuvadalara 2.. ఆస్కార్ గ్రహీత సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) హీరోగా, కమెడియన్ సత్య (Satya), ఫరియ అబ్దుల్లా (Faria Abdullah) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా -2. ఈ మూవీ సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సత్య బ్యాక్ బోన్ గా నిలిచారని వార్తలు కూడా వినిపించాయి. ఇక రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లతో సునామీ సృష్టించింది ఈ సినిమా.


డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మత్తు వదలరా -2

ఫన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సెటైరికల్ క్రైమ్ థ్రిల్లర్ శుక్రవారం 11 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. దసరా పండుగ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ని కూడా విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో ఈ దసరా పండుగకు ఇంట్లో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లు నవ్వులు పూయించడానికి సిద్ధమవుతున్నారు అంటూ మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ మేకర్స్ అంచనాలను క్రాస్ చేసి ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది.


మత్తు వదలరా -2 సినిమా కథ..

మత్తు వదలరా -2 సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డెలివరీ ఏజెంట్లు బాబు (శ్రీ సింహ), ఏసు ( సత్య) ఉద్యోగాల వేటలో ఉంటారు. దొంగ దారిలో హీ టీమ్ లో ఉద్యోగాలు సంపాదిస్తారు. అనుకోకుండా హాయ్ ఎమర్జెన్సీ టీం రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో లంచం ఇచ్చి ఉద్యోగం కొనుగోలు చేస్తారు. అయితే నా జీతం ఏమాత్రం కూడా సరిపోకపోవడంతో ఒక కన్నింగ్ ప్లాన్ కూడా వేస్తారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల కొంత మొత్తాన్ని దొంగలించడం మొదలు పెడతారు ఇలా సాగిపోతున్న సమయంలో వీరి దగ్గరికి ఒక పెద్ద కేసు అనుకోకుండా వస్తుంది .తన కుమార్తె కనిపించడం లేదని , కిడ్నాపర్లు ఏకంగా రూ .2కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, ఏసుకి దామిని (ఝాన్సీ) చెబుతుంది.

అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్..

ఇక దీనిని అదునుగా తీసుకోని, ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వద్దని, ఈ కేసును తామ పర్సనల్గా డీల్ చేస్తామని కూడా వారు చెబుతారు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక మర్డర్ కేసులో వారు ఇద్దరు ఇరుక్కుంటారు. ఆ తర్వాత బాబు ,యేసుని కావాలని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? అసలు తేజస్వి తోట తన పేరును ఆకాష్ గా అసలు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది..? ముందుగా ఒక కిడ్నాప్ కేసు కారణంగా ఆకాష్ మర్డర్ కేసులో ఎలా బుక్ అవుతారు..? అసలు ఆకాష్ ను చంపింది ఎవరు..? మర్డర్ కేస్ లో ఇరుక్కున్నవారికి నిధి ( ఫరియా అబ్దుల్లా ) ఎందుకు సహాయం చేసింది..? అసలు దామిని ఎవరు? ఇలా ఎన్నో విషయాలు తెలియాలి అంటే కచ్చితంగా ఈ మత్తు వదలరా -2 చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×