BigTV English

OTT Movie : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : సర్వైవల్ చుట్టూ తిరిగే ఒక మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్, ఓటీటీలో మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్ కి రానుంది. థియేట్రికల్ రన్ తర్వాత 6 వారాల్లోపే ఇది డిజిటల్ ప్రీమియర్‌గా వస్తోంది. ఇది IMDbలో కూడా 9.4/10 టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఆరుగురు స్నేహితులు ఒక అడవిలో ఎదుర్కునే సంఘటనలతో ఈ స్టోరీ నడుస్తుంది. థియేట్రికల్ రన్ లో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓటీటీలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది. ఇందులో సీట్ ఎడ్జ్‌ సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే 

ఆనందు, మిథున్ కేరళలోని ఒక సముద్రతీర గ్రామంలో చిన్నప్పటి నుంచి మంచి అనుబంధంతో పెరిగిన బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లు కలిసి సముద్రంలో ఈత కొట్టడం, ఫిషింగ్ బోట్‌లో గంటలు గడపడం, ఒకరి కోసం ఒకరు ఫైట్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ కాలేజీ రోజుల్లో కుల డిఫరెన్సెస్, సొసైటల్ ప్రెషర్స్ వల్ల వీళ్ల మధ్య గ్యాప్ వస్తుంది. మిథున్ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ నుంచి, ఆనందు కాస్త హైయర్ సోషల్ స్టేటస్ ఫ్యామిలీ నుంచి రావడంతో ఈ సమస్య వస్తుంది. ఇంతలో ఒక కార్పొరేట్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ వాళ్ల గ్రామంలో రావడంతో, మిథున్ కమ్యూనిటీకి జాబ్స్, హౌసెస్ ప్రామిస్ చేస్తుంది. కానీ ఆనందు ఈ డెవలప్‌మెంట్‌లో ఒక రోల్ ప్లే చేస్తాడు. ఇది మిథున్‌కి బెట్రయల్‌లా అనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాలు గడిచాక, మిథున్ ఫారెస్ట్ ఆఫీసర్ అవుతాడు. ఆనందు సిటీలో సక్సెస్‌ఫుల్ కెరీర్‌తో ఎగోస్టిక్‌గా మారతాడు. వీళ్ల ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అవుతుంది. కానీ మిథున్ ఆనందుని, వాళ్ల కామన్ ఫ్రెండ్‌ని ఒక ఫారెస్ట్ క్యాంప్‌కి ఇన్వైట్ చేస్తాడు. ఈ మీటింగ్ వెనుక మిథున్ హిడెన్ రివెంజ్ మోటివ్ ఉందని హింట్ వస్తుంది. ఫారెస్ట్ క్యాంప్‌లో ఆనందు, మిథున్, వాళ్ల ఫ్రెండ్ కలుస్తారు. కానీ అక్కడ వీళ్లు ఒక డేంజరస్ గ్రూప్‌తో ఢీ కొడతారు. కిథో ఒక హంటర్, అతని ముగ్గురు మిత్రులతో అల్కహాల్ కోసం ఫారెస్ట్‌లో ఉంటారు.


ఈ రెండు గ్రూప్స్ మధ్య ఒక చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్ పెద్ద కాన్ఫ్లిక్ట్‌గా మారుతుంది. ఇప్పుడు మిథున్ రివెంజ్ మోటివ్ స్లోగా రివీల్ అవుతుంది. కానీ ఆనందు కూడా తన సొంత ప్లాన్‌తో కౌంటర్ చేస్తాడు. ఫారెస్ట్ వైల్డ్ నేచర్, చీకటి, డేంజరస్ టెరైన్ తో ఈ కథ ఒక సర్వైవల్ గేమ్‌గా మారుతుంది. ఎవరు ఎవరిని బ్యాక్‌స్టాబ్ చేస్తారు? ఫ్రెండ్‌షిప్ రీకైండిల్ అవుతుందా ? లేక బ్లడ్‌షెడ్‌తో ముగుస్తుందా? అనేది క్లైమాక్స్ లో థ్రిల్ ని పీక్స్‌కి తీసుకెళ్ళే సన్నివేశాలను చూసి తెలుసుకోండి.

ఆహా తమిళ్ ప్లాట్‌ఫామ్‌లో

‘మీషా’ (Meesha) ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సస్పెన్స్ సినిమా. యూనికార్న్ మూవీస్ పతాకంపై సజీర్ గఫూర్ దీనిని నిర్మించారు. ఇందులో కత్తిర్ (మిథున్), హక్కీమ్ షాజహాన్ (ఆనందు), షైన్ టామ్ చాకో, సుధి కోప్ప, జెయో బేబీ, శ్రీకాంత్ మురళి, హస్లీ అమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైంది. 2025 సెప్టెంబర్ 12 నుంచి ఈ సినిమా ఆహా తమిళ్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2 గంటల 5 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 9.4/10 రేటింగ్ పొందింది.

Read Also : శవాలని తవ్వి తినే సైకో.. ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

Related News

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే

OTT Movie : అర్ధరాత్రి తల్లీపిల్లల్ని టార్గెట్ చేసే సైకో… ఆమె ఇచ్చే ఝలక్ నెవర్ బిఫోర్… మైండ్ బెండింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : 20 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి పాడు పనులు… భార్యేమీ తక్కువ తినలేదు… భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ

OTT Movie : తెగిపడే అమ్మాయిల తలలు…. అత్యంత దారుణంగా నరికి చంపే సీరియల్ కిల్లర్… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

Conjuring Movies: కంజ్యూరింగ్ మూవీస్ ఈ ఆర్డర్‌లో చూస్తేనే మజా.. ఈ లిస్ట్ ఫాలో అయిపోండి, ఓటీటీలో ఉన్నాయ్!

Big Stories

×