OTT Movie : హారర్ సస్పెన్స్ జానర్ లో వచ్చిన ఒక బెంగాలీ సినిమా ప్రశంసలు అందుకుంది. ఇది సస్పెన్స్ జానర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది. కేషబ్‌పూర్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం, నర్సులపై వరుస హత్యల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రిలోని చీకటి కారిడార్‌లు, ఓపెన్ విండో ద్వారా వచ్చే వింత శబ్దాలు గూస్‌బంప్స్ ఇస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సుజాత, మజుమ్దార్ కేశవ్‌పూర్‌లోని ఒక చిన్న ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తుంటారు. ఈ పట్టణంలో నర్సుల హత్యలు జరుగుతుంటాయి. స్థానికులు కూడా భయపడుతుంటారు. ఒక వర్షపు రాత్రి, వీరిద్దరూ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్‌లో ఉంటారు. ఆసుపత్రి చీకటిగా, ఖాళీగా ఉంటుంది. ఒక ఓపెన్ విండో నుండి చల్లని గాలి వస్తోంది. సుజాత, సీనియర్ నర్సు, కొంచెం అలర్ట్‌గా ఉంటుంది. అయితే మజుమ్దార్ కొత్త నర్సు, కొంచెం భయపడుతూ, ఆసుపత్రిలో వింత శబ్దాల గురించి సుజాతతో చెబుతుంది. ఇప్పుడు మిస్టరీ మొదలవుతుంది. రాత్రి గడిచే కొద్దీ, వింత సంఘటనలు జరుగుతాయి. ఆసుపత్రి కారిడార్‌లో ఎవరో నడిచే శబ్దాలు, ఒక షాడో గోడల మీద కనిపిస్తుంది. ఆ ఓపెన్ విండోని ఎవరూ తాకకపోయినా, తెరుచుకుని మూసుకుంటూ ఉంటుంది. సుజాత మజుమ్దార్ కి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు కూడా ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తుంది.
ఈ సమయంలో ఆసుపత్రిలో ఒక వృద్ధ పేషెంట్ వింతగా ప్రవర్తిస్తాడు. ఇక్కడే కథ ఒక షాకింగ్ టర్న్ తీసుకుంటుంది. కేశవ్‌పూర్‌లో నర్సులను ఎవరో టార్గెట్ చేసి చంపుతున్నారని తెలుస్తుంది. ఈ హత్యల వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు. సుజాత, మజుమ్దార్ ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ కిల్లర్ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే కిల్లర్ ఆ వృద్ధ పేషెంట్ కాదు, కానీ ఆసుపత్రిలో పనిచేసే నఫీజ్ అనే ఒక స్టాఫ్ మెంబర్. అతను నర్సులను టార్గెట్ చేయడానికి కారణం ఒక డీప్ సైకలజికల్ స్టోరీ ఉంది. అతని సోదరి గతంలో ఒక నర్సు. ఆసుపత్రిలో అవమానకరమైన సంఘటన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. నఫీజ్ ఈ ఆసుపత్రిలోని నర్సులను దానికి బాధ్యులుగా భావిస్తాడు. పగ తీర్చుకోవడానికి హత్యలు చేస్తాడు. సుజాత, నఫీజ్ అనుమానాస్పద ప్రవర్తనను గమనిస్తుంది. అతను మజుమ్దార్‌ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక టెన్స్ ఛేజ్ సీన్‌లో, సుజాత, మజుమ్దార్ ఆసుపత్రి కారిడార్‌లో నఫీజ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి వీళ్ళు ఆ సైకో నుంచి తప్పించుకుంటారా ? అతని చేతిలో బలవుతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
“ఎక్తి ఖోలా జానాలా” (Ekti khola janala) విక్కీ జాహెద్ దర్శకత్వంలో వచ్చిన బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. KS ఫిల్మ్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రం, తస్నియా ఫారిన్, సల్హా ఖానం నాడియా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రోనాబ్ ఘోష్, మిజాన్ రహ్మాన్, నాఫిజ్ అహ్మద్, షహజాదా సోమ్రత్ చౌధురి సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. ఈ సినిమా 2024సెప్టెంబర్ 4న Binge ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ అయింది. 50 నిమిషాల నిడివితో IMDbలో 5.2/10 రేటింగ్ పొందింది.
Read Also : వేరే వ్యక్తి భార్యను ఇంటికి తీసుకొచ్చి… మైండ్ బెండయ్యే ట్విస్టులు… మస్ట్ వాచ్ బెంగాలీ రొమాంటిక్ డ్రామా