E-Paper
Advertisement

Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!

Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ బాయ్స్ హాస్టల్‌లో వార్డెన్ కిషన్ నాయక్ అరాచకాలు ఇంకా ఆగలేదు. తన సస్పెన్షన్‌కు విద్యార్థులే కారణమని వార్డెన్ కిషన్ నాయక్ కక్ష పెంచుకున్నారు. ఇప్పటికే విద్యార్థులను చంపేయాలంటూ మాట్లాడినట్లుగా ఉన్న  కిషన్‌నాయక్ ఆడియో వైరల్‌గా మారింది.

వార్డెన్‌గా బాధ్యతలు కోల్పోయినా..  విద్యార్థులపై వేధింపులు ఆగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిర్గాపూర్‌లోని హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన మిత్రుడు లక్ష్మణ్ ద్వారా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాడు.  కిషన్ నాయక్ సూచనలతో  టీచర్ లక్ష్మణ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడు.

Advertisement

తాము మాట్లాడితే బండబూతులు తిడుతూ కొడుతున్నారని..  చిన్న చిన్న కారణాలకే శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని విద్యార్థులు  కన్నీళ్లు పెట్టుకుంటూ తమ గోడు వెల్లబోసుకున్నారు. భయభ్రాంతులకు గురై చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే  విచారణ జరిపి..  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ALSO READ: ONGC Gas Leak: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం.. ఇరుసుమండలో కొనసాగుతున్న హైటెన్షన్!

Related News

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×