BigTV English

OTT Movie : టీచర్ పై రివేంజ్ కి ఇంతలా దిగజారుతారా … వీళ్ళు చేసే పనికి రక్తం మరిగిపోద్ధి

OTT Movie : టీచర్ పై రివేంజ్ కి ఇంతలా దిగజారుతారా … వీళ్ళు చేసే పనికి రక్తం మరిగిపోద్ధి

OTT Movie : వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొత్త కొత్త స్టోరీలతో ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో టీచర్, స్టూడెంట్ ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టీచర్ కి ఒక స్టూడెంట్ మానసికంగా బాగా ఇబ్బంది పెడుతుంది. రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సిరీస్ చివరివరకూ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జీ 5 (ZEE5) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘మిథ్య’ (Mithya). దీనికి రోహన్ సిప్పీ దర్శకత్వం వహించగా, ఈ సిరీస్ ను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, విపిన్ అగ్నిహోత్రి ఫిలిమ్స్ నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్ 18 ఫిబ్రవరి 2022న విడుదలైంది. ఇందులో హుమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రత ఛటర్జీ, రజిత్ కపూర్, సమీర్ సోనీ కీలక పాత్రల్లో నటించారు. ఈ ధారావాహిక బ్రిటిష్ టెలివిజన్ షో చీట్ నుండి స్వీకరించబడింది. అవంతిక దస్సాని ఈ సిరీస్‌తో తొలిసారిగా నటించింది. డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో ఈ డ్రామా ప్రత్యేకంగా చిత్రీకరించబడింది. మొదటి సీజన్ ముగిసిన తర్వాత, మిథ్య: ది డార్కర్ చాప్టర్ పేరుతో రెండవ సీజన్ అక్టోబర్ 2024 లో నవంబర్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది జీ 5 (ZEE5) లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

(సీజన్ 1):

జూహీ ఒక హిందీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె తన విద్యార్థి రియాను ఒక లిటరేచర్ ఎస్సేలో కాపీ కొట్టిందని ఆరోపిస్తుంది. రియాఒక ప్రముఖని కుమార్తె, ఈ ఆరోపణను ఖండిస్తూ, జూహీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక విధ్వంసకర మార్గంలో అడుగులు వేస్తుంది. ఈ ఘర్షణ విద్యాపరమైన వివాదం నుండి మానసిక యుద్ధంగా మారుతుంది. జూహీ వ్యక్తిగతం, వృత్తిపరమైన జీవితం రియా చేతిలో నాశనమవుతుంది. అయితే రియా చర్యల వెనుక ఉన్న కారణాలు క్రమంగా వెల్లడవుతాయి. సీజన్ 1 ఒక ఉత్కంఠభరితమైన క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగుస్తుంది.

సీజన్ 2 (మిథ్య: ది డార్కర్ చాప్టర్):

ఆరు నెలల గ్యాప్ తర్వాత, కథ మరింత ఉద్రిక్తంగా మారుతుంది. జూహీ తను రచించిన పుస్తకం ‘ధుంద్’ విజయవంతం అవ్వడంతో,సెలెబ్రేట్ జరుపుకుంటుండగా, అమిత్ చౌదరి అనే రచయిత ఆమెను కాపీ కొట్టింది అనే ఆరోపణలతో దిగ్భ్రాంతికి గురి చేస్తాడు. మరోవైపు, రియా తన కుటుంబ ఆస్తిని సొంతం చేసుకోవడానికి, తన తండ్రి ప్రేమను సంపాదించడానికి కుట్రలు పన్నుతుంది. ఈ క్రమంలో ఆమె తన తండ్రి మరణానికి కూడా కారణమవుతుంది. ఆ తరువాత జూహీ, రియా మధ్య పోరాటం మరింత తీవ్రమవుతుంది. చివరికి జూహీ పై రియా ఎందుకు అంత పగ పెంచుకుంటుంది ? దీనికి జూహీ ఎలా రియాక్ట్ అవుతుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే,ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : తెల్లార్లూ ఎంజాయ్… ఉదయాన్నే ఒంటిపై నూలు పోగు లేకుండా… ఎవరితో ఆ పని చేసిందో కూడా గుర్తులేనంతగా…

Tags

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×