OTT Movie : ఓటిటిలో ఇప్పుడు సినిమాలకు దీటుగా మేము సీరియస్ గా వెబ్ సిరీస్ లు నడుస్తున్నాయి. ఇవి వచ్చాక అత్త కోడలు లాంటి సీరియల్స్ ను చూడటం తగ్గించి, వీటిమీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక డాక్టర్ల లైఫ్ స్టైల్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్లు వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ ముందుకు వెళ్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీ మింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ వెబ్ సిరీస్ పేరు ‘మండే మార్నింగ్స్ వన్ ఫైన్ డే’ (Monday Mornings : One Fine Day). 2013 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మారియో వ్యాన్ పీబలెస్ దర్శకత్వం వహించారు. ఇందులో డాక్టర్ లు వృత్తి పరంగా ఎదుర్కునే కొన్ని సంఘటనలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ప్లెక్స్ (Plex) లో అందుబాటులో ఉంది.
స్టోరీ లోకి వెళితే
ఈ ఎపిసోడ్‌లో, డాక్టర్ టై విల్సన్, డాక్టర్ టీనా రిడ్జ్‌వే లకు అర్ధరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకుంటారు. అక్కడ కార్ప్స్‌మన్ జాకబ్ గోల్డ్ అనే వ్యక్తి తన భార్య మెరైన్ తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దీంతో అతను సహాయం కోసం ఈ డాక్టర్ లకు ఫోన్ చేసి ఆర్థిస్తాడు. టై, టీనా ఈ సందర్భంలో వైద్య సలహాలు ఇవ్వడం ద్వారా అతనికి సహాయం చేస్తారు. అప్పుడు ఆమె ప్రాణాలతో బయట పడుతుంది. మరోవైపు, డాక్టర్ సిడ్నీ నాపూర్ ఒక వింత శిశువు కి ట్రీట్ మెంట్ చేయాల్సి వస్తుంది. ఒక శిశువు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్నవాళ్ళు ఆ శిశువు ను వింతగా చూస్తుంటారు. ఆ బేబీ చూడటానికి క్యూట్ గా ఉన్నా, నిరంతరం నవ్వుతూ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతారు. దీనికి కారణం నాడీ సంబంధిత సమస్య ఆ శిశువుకు ఉందని ఆ డాక్టర్ నమ్ముతుంది. ఆమె ఈ కేసును పరిశీలించి, దాని వెనుక ఉన్న కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు స్టోరీ డాక్టర్ సంగ్ పార్క్, డాక్టర్ హార్డింగ్ కు మల్లుతుంది. హూటెన్ అనే ఒక స్వలింగ సంపర్కుడైన రోగి అనుకోకుండా బ్రైన్ డెడ్ తో చనిపోతాడు. అ తరువాత అతని భర్త, సోదరికి డాక్టర్ లు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పరిస్థితి చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆ కుటుంబ సభ్యులు కోర్ట్ కు వెళతారు. ఇక చట్టపరంగా ఆ డాక్టర్ లు దానిని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఎపిసోడ్ వైద్యుల జీవితంలోని వృత్తిపరమైన, వ్యక్తిగత సవాళ్లను, అలాగే వారు తీసుకునే కఠిన నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది.