Aadarsh Balakrishna: తెలుగు బిగ్ బాస్ ఫేమ్ ఆదర్శ్ బాలకృష్ణ గురించి పరిచయం అనవసరం. ఈయన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే పాల్గొని రన్నరప్ గా నిలచాడు.. సినిమాల్లో నటుడుగా నటించాడు. కానీ బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇక గతంలో ఝాన్సీ వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించిన ఆదర్శ్.. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే తాజాగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలుస్తుంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆయన కాలికి సర్జరీ ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నటుడు కాలికి గాయం.. ఏమైందంటే..?
ఆదర్శ్ బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సర్జరీ తొలి రోజు చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసిన వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదర్శ్ బాలకృష్ణ నడవలేని స్థితికి చేరుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా మోకాలి దగ్గర గాయమవగా వైద్యులు సర్జరీ చేశారు. దీంతో ఆయన కర్ర సాయంతో నడుస్తున్నారు.. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
Also Read :బాలయ్య చేసిన పెద్ద మిస్టేక్.. మోక్షజ్ఞ ఎంట్రీకి అదే కారణం..?
సినిమాల విషయానికొస్తే..
ఆదర్శ్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో నటించాడు. ఈయన 2005లో ఇక్బాల్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నిజానికి ఇదొక హిందీ సినిమా. ఇక తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించాడు. సినిమాలలో సహాయక పాత్రలో ఆదర్శ్ నటించాడు. ఆదర్శ్, వరుణ్ సందేష్ నటించిన హ్యాపీ డేస్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత రైడ్, జీనియస్, మరో చరిత్ర, రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే, అల్లు అర్జున్ నటించిన సరైనోడు, విజేత, కలర్ ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాలలో తన నటనతో అందరిని ఆకర్శించాడు. నిజానికి ఈయన హీరో మెటీరియల్. కానీ ఎక్కువ అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. పెద్దగా సినిమాలు చెయ్యలేదు..
ఈ మధ్య సినిమాల్లో, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించలేదు. కానీ తాజాగా ఇలా కాలికి గాయంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ గాయపడిన కాలికి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ లాంటివి కూడా చేస్తున్నాడు. ఆ వీడియో పోస్ట్ చేసి.. త్వరలో క్యామ్ బ్యాక్ ఇస్తాను అని క్యాప్షన్ లో ఆదర్శ్ రాసుకొచ్చాడు. ఇక ఆదర్శ్ కి ఏమైంది అనేది తెలీదు.. కానీ అతన్ని త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సినీ ప్రముఖులు సైతం కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
నడవలేని స్థితిలో బిగ్ బాస్ ఫేమ్
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ ఆదర్శ్ బాలకృష్ణ నడవలేని స్థితికి చేరుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా మోకాలి దగ్గర గాయమవగా వైద్యులు సర్జరీ చేశారు. దీంతో ఆయన కర్ర సాయంతో నడుస్తున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్స్టాలో తాజాగా ఓ… pic.twitter.com/aTFCulR8ZY
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2025