Action Movie In OTT : తమిళ హీరో, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకేక్కిస్తున్నారు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయిన కూడా ఓ మాదిరిగా కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాయి. ప్రభుదేవా తన సినిమా ప్రేమికుడు లోని పెట్టా రాప్ అనే లైన్ తోనే ఇప్పుడు ఓ సినిమా చేసాడు. మంగళవారం ఓటీటీలోకి రాబోతోంది. ఎన్టీఆర్ దేవర మూవీకి పోటీగా సెప్టెంబరు 27 న విడుదలైన ఈ తమిళ్ సినిమా.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక కలెక్షన్స్ అంత పెద్దగా అయితే రాబట్టలేదు. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలోకి రాబోతుంది అనేది కాస్త డీటెయిల్ గా తెలుసుకుందాం..
మాస్, యాక్షన్ కామెడితో వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎస్‌జే సిను దర్శకత్వం వహించిన ఈ పేట్టా రాప్ మూవీలో సన్నీ లియోన్ ఒక కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి ఈ సినిమా నవంబరు 8న ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించినప్పటికి కొన్ని కారణాల కారణంగా ఓటీటీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఇప్పుడు నవంబరు 12 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది.. థియేటర్లలో పర్వాలేదనే టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ, డైరెక్షన్ వైపు వచ్చిన ప్రభుదేవా.. సౌత్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విజయ్‌తోఈ ఏడాది గోట్, శివ రాజ్‌కుమార్‌తో ఒక సినిమాలోనూ ప్రభుదేవా నటించాడు.
ఇక పేట్టా రాప్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోనేకాదు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. సినిమాల్లో హీరో అవ్వాలనే ఆశ తో ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన యువకుడి కతగా ఈ మూవీ వచ్చింది. దాదాపు అతను 100కి పైగా ఆడిషన్స్ ఇచ్చినా ఒక్క ఛాన్స్ కూడా అతనికి దక్కదు. దాంతో అందరూ అతడ్ని హేళన చేస్తూ మాట్లాడటం తో.. తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అతనికి జానకి పరిచయం అవుతుంది. సింగర్ అయిన ఆమె బాలా కలని నెరవేర్చేందుకు ఎలా సాయ పడింది? ఇద్దరూ తమ కలని నెరవేర్చుకుంటారా? అనేది ఈ మూవీ స్టోరీ.. ఇక ఈ మూవీని జోబి నిర్మించగా.. పి.సామ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదికతో పాటు వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేష్ తిలక్, జయప్రకాష్, రియాజ్ ఖాన్, మైమ్ గోపి, కళాభవన్ షాజోన్, రాజీవ్ పిళ్లై మొదలగు ప్రముఖులు నటించారు.. ఇక ప్రభుదేవా మాస్టర్ తెలుగులోని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ కూడా పని చేస్తున్నారు. అలాగే తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.