Best OTT Horror Movies : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో భయపెట్టే విధంగా ఉండే హర్రర్ సినిమాలను ఓటీటీలో చూడటం అంటే హర్రర్ మూవీ లవర్స్ కు బాగా ఇష్టం. అందుకే భాష ఏదైనా సరే హర్రర్ మూవీ అయితే చాలు సబ్ టైటిల్స్ తో సినిమాను చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు. అలా హర్రర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్స్. అయితే ఇవి సాదాసీదా హర్రర్ మూవీస్ కాదు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బెస్ట్ మలయాళం హర్రర్ సినిమాలు.
ఎజ్రా (Ezra) – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus hotstar)
‘ఎజ్’ అనే హర్రర్ మూవీకి జెకే దర్శకత్వం వహించారు. ఈ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం 2017 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియా ఆనంద్ లీడ్ రోల్స్ పోషించారు. పురాతన వస్తువులతో పాటు యూదుల శాసనాలు ఉన్న ఒక విచిత్రమైన పెట్టె దొంగతనం జరగ్గా, ఆ పెట్టెలో ఉన్న అతీంద్రియ శక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది.
నీలవెలిచం (Neelavelicham) – అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
“నీలవెలిచం” అనేది ఆషిక్ అబు దర్శకత్వంలో రూపొందిన మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో టోవినో థామస్ హీరోగా నటించగా, ఆయనతో పాటు రీమా కల్లింగల్, రోషన్ మాథీవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 1964లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా ‘భార్గవి సద్దాం’కి సీక్వెల్. సినిమా మొత్తం భార్గవి స్టేషన్ అనే భవనంలో నదించే అతీంద్రియ సంఘటనల చుట్టూ సాగుతుంది.
9 (Nine) – అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
జెన్సు మహమ్మద్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం ‘9’. 2019 లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ హర్రర్ మూవీ ‘వాల్ నక్షత్రం’ అనే కథ ఆధారంగా తెరపైకి వచ్చింది. ఇది 9 రోజుల్లో భూమికి దగ్గరగా రావడం, దాని కారణంగా జరిగే భయంకరమైన పారానార్మల్ సంఘటనల చుట్టూ కథ నడుస్తుంది.
భ్రమ యుగం (Bramayugam) – సోనీ లివ్ (Sony LIV)
మలయాళ సినిమా మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హర్రర్ చిత్రం భ్రమయుగం. 2024లో హర్రర్ మూవీ లవర్స్ కు కిక్ ఎక్కించిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. మలబార్ అడవిలో తిరుగుతూ కొడుమాన్ పోటి ఇంటికి చేరుకునే వ్యక్తికి ఎదురైన సమస్యలు ఏంటి? అక్కడి నుంచి అతను బయట పడగలిగాడా? అక్కడ ఉన్న సీక్రెట్ ఏంటి? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో మమ్ముట్టి నెగెటివ్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నారు.
రోమంచమ్ (Romancham) – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus hotstar)
2023లో రిలీజ్ అయిన కామెడీ హర్రర్ మూవీ “రోమంచం”. ఈ సినిమా అంతా అద్దె ఇంట్లో నివసించే కొందరు స్నేహితులు ఆడే దెయ్యాల బోర్డ్ గేమ్ చుట్టూ తిరుగుతుంది. సాధారణ గేమ్ లా స్టార్ట్ అయ్యి, నిజమైన దెయ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉండే స్నేహితులంతా ఆ దెయ్యం వల్ల కష్టాల్లో కూరుకుపోతారు.