BigTV English

OTT Movie : తన శవాన్ని తానే పాతిపెట్టే హీరో… క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ తెలుగులో

OTT Movie : తన శవాన్ని తానే పాతిపెట్టే హీరో… క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ తెలుగులో

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచితనానికి వచ్చే ఇబ్బందులు ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ఈటీవీ విన్ (Etv win)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు “కలి” (Kali). హీరో తన మంచితనంతో ఆస్తులతో పాటు భార్యను కూడా పోగొట్టుకొని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (Etv win) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈ మూవీలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే సమస్య హీరో మంచితనంతో వస్తుంది. హీరోను బాబాయ్ బిజినెస్ కోసం డబ్బులు తీసుకొని మోసం చేస్తాడు. ఆస్తిని బ్యాంకులో తాకట్టుపెట్టి హీరోకి అ న్యాయం చేస్తాడు. భార్య వద్దని చెప్పినా కూడా వినకుండా ఇలా చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఒకరోజు యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే అతడిని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అయితే హీరోనే యాక్సిడెంట్ చేసి, పేషెంట్ ని తీసుకువచ్చాడని పోలీసులు కేసు నమోదు చేస్తారు. భార్య బెయిల్ తీసుకొని వచ్చి, ఎందుకు వేరే వాళ్ళ సమస్యల్లో తల దురుస్తావు అంటూ గొడవపడి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసిన హీరో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో కలి అనే వ్యక్తి హీరో ఇంటికి వస్తాడు. అతడు ఆత్మహత్య చేసుకునే లెటర్ లో హీరో ఏమి రాశాడో అన్నీ చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు.

ఇంతలో కలి ఒక గేమ్ ఆడమని హీరోకు చెప్తాడు. ఆ గేమ్ ఆడిన తర్వాత హీరో కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంట్లో ఒక బెడ్ మీద శవం పడి ఉంటుంది. అది ఎవరిదో కాదు హీరోదే. హీరో అతడి రూపాన్ని అతని కళ్ళ ముందరే చూసుకొని ఆశ్చర్యపోతాడు. ఆ శవాన్ని తీసుకొని ఇంటి బయట గోతిలో పాతి పెడతాడు. ఆ తరువాత హరో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటాడు.  ఇంతకీ హీరో ఇంటికి వచ్చి గేమ్ ఆడిన వ్యక్తి ఎవరు? హీరో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాడా? హీరో తన భార్యతో మళ్లీ కలసి జీవిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈటీవీ విన్ లో  స్ట్రీమింగ్ అవుతున్న “కలి” (Kali) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. మరెందుకు ఆలస్యం ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీపై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×