BigTV English

Crime Thriller Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Crime Thriller Movie In OTT :  ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Crime Thriller Movie In OTT : థియేటర్లలోకి వచ్చే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇక జనాల అభిరుచికి తగ్గట్లు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ సినిమాలు మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. రోజు ఏదొక సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఎలాంటి టాక్ ను అందుకున్నా ఇక్కడ మాత్రం భారీ వ్యూస్ ను రాబడుతూన్నాయి. తాజాగా ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా నాలుగు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఓటీటీలో క్రైమ్ సినిమాలకు కొదవ లేదు.. ఏదొక ప్లాట్ ఫామ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ తమిళ్ మూవీ రిలీజ్ అయ్యింది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంధగన్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన అంధాధున్ మూవీ రీమేక్ గా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆగస్టు 9 న థియేటర్లలోకి వచ్చింది. త్యాగరాజన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఈ తమిళ్ మూవీలో ఈ సినిమాలో ప్రశాంత్, సిమ్రన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్ రవికుమార్ లాంటి వాళ్లు నటించారు.. అందుధన్ మూవీ ఆరేళ్ళ క్రితం హిందీలో వచ్చిన అంధాధున్ మూవీకి రీమేక్. హిందీతో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబులాంటి వాళ్లు నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఊహించని ట్విస్టులతో మంచి థ్రిల్ పంచింది.. తెలుగులో కూడా వచ్చింది. కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ మూవీలో పియానిస్ట్ చుట్టూ తిరుగుతుంది. కళ్లు లేని వాడిగా నటిస్తూ ఉండే అతడు.. ఓ రోజు అనుకోకుండా ఓ సినిమా నటుడి హత్యను చూస్తాడు. ఆ ఘటన తర్వాత అతని జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. అక్కడి నుంచి సినిమాలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మొత్తానికి కథ సుఖాంతం అవుతుంది. ఇక ఓటీటీ లో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.., ట్విస్ట్ లతో కూడిన థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యాలని అనుకొనే వాళ్ళు ఈ సినిమాను ఆమెజాన్ ప్రైమ్ చూసి ఎంజాయ్ చెయ్యండి.. అమెజాన్ ప్రైమ్ లో ఇలాంటి సరి కొత్త కంటెంట్ సినిమాలు తరచూ వస్తుంటాయి. అలాగే బోల్డ్ మూవీలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయి..


Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×