OTT Movie : కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు అభిమానులు బాగా పెరిగిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కొరియన్ సినిమాలను, సిరీస్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. తెలుగు సీరియల్స్ లా వీటిని కూడా చూస్తున్నారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక కొరియన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కొరియన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మిస్టర్ జూ: ది మిస్సింగ్ విఐపి‘ (Mr. Zoo : The Missing VIP). 2020లో విడుదలైన ఈ దక్షిణ కొరియా కామెడీ డ్రామా మూవీకి కిమ్ టే యూన్ రచనతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఇందులో లీ సుంగ్-మిన్, కిమ్ సియో-హ్యూంగ్, బే జంగ్-నామ్ మరియు షిన్ హా-క్యున్ నటించారు. జనవరి 22, 2020న విడుదలైన ఈ మూవీ కామెడీ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కిడ్నాప్ చేయబడిన పాండాను, హీరో వెతికే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ కొరియన్ కామెడీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. ఇతడు చాలా రూల్స్ ఫాలో అవుతూ ఉండటంతో, పెళ్ళాం కూడా వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. ఆఫీస్ లో మాత్రం మంచి ఎంప్లాయ్ గా పేరు తెచ్చుకుంటాడు. తొందర్లో హీరోకి ప్రమోషన్ కూడా ఇవ్వబోతారు. ఈ క్రమంలో వీళ్ళ ఆఫీస్ కి పాండాను జాగ్రత్తగా చూసుకోమని చైనా నుంచి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఆ పాండా చైనా నుంచి రాగానే, ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ పాండాని కొంతమంది వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. పాండాను హీరోతో పాటు అతని అసిస్టెంట్ కూడా వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో హీరోకి దెబ్బ తగలడంతో, ఒక సూపర్ పవర్ వస్తుంది. జంతువులు మాట్లాడుకునే మాటలు హీరోకి వినపడుతూ ఉంటాయి. ఆ పాండా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చని గొరిల్లా హీరోతో చెప్తుంది. ఒక కుక్క హెల్ప్ తీసుకోవాలని చెప్పడంతో, హీరో ఆ కుక్కని తీసుకొస్తాడు.
అప్పుడు ఆ కుక్క ద్వారా, ఆ పాండాని కనుక్కోవాలని హీరో ట్రై చేస్తాడు. కుక్క వాసన పసిగట్టి తన ఓనర్ ని చంపింది, పాండాని ఎత్తుకెళ్లింది ఒకరే అని తెలుసుకుంటుంది. చివరికి ఆ పాండాని హీరో కనిపెడతాడా? దొంగ ఎందుకు పాండాని కిడ్నాప్ చేస్తాడు? కుక్క పాండాని కనిపెట్టడానికి, హీరోకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మిస్టర్ జూ: ది మిస్సింగ్ విఐపి’ (Mr. Zoo : The Missing VIP) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.