BigTV English

Sritej Health Update : శ్రీతేజ్ కు మెమొరీ లాస్.. టెన్షన్ లో అల్లు అర్జున్…

Sritej Health Update : శ్రీతేజ్ కు మెమొరీ లాస్.. టెన్షన్ లో అల్లు అర్జున్…

Sritej Health Update : గత ఏడాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యావత్ సినీ ప్రేక్షకులను కదిలించి వేసింది. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్‌ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్‌ అవ్వలేదు. మూడు నెలల నుంచి అలాగే ఆసుపత్రి బెడ్ మీద పడివున్నాడు. ఆ బాలుడు కోలుకొవాలని యావత్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ అతన్ని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు పంపిస్తున్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇపుడు శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా అతని మెమొరీ లాస్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..? 

శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడటంతో బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదని కిమ్స్ వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీతేజ్ ఆసుపత్రి పాలై ఇప్పటికే దాదాపు మూడు నెలలు అవుతుంది . కిమ్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎంత ఖర్చయినా చూసుకుంటామని అల్లు అర్జున్ ప్రకటించాడు.. అయినా అతని ఆరోగ్యం మాత్రం మెరుగవ్వలేదు. ఇక విదేశాలకు తీసుకెళ్లాలని అనుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బాలుడు మెమొరీ లాస్ అయినట్లు టాక్..


అల్లు అర్జున్ నిర్ణయం..? 

శ్రీతేజ్‌ విషయంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో శ్రీతేజ్ను ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని, శ్రీతేజ్ను కాపాడుకోవాలని ఆయనడిసైడ్ అయినట్లు సమాచారం.. శ్రీతేజ్‌ను కాపాడ్డానికి డాక్టర్లు దాదాపు చాలా కష్టపడుతున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో అల్లు అర్జున్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీతేజ్‌ కుటుంబానికి పుష్ప యూనిట్‌ నుంచి ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్‌ నుంచి ఆర్థిక సహాయం అందింది.. ఎంత డబ్బులు వచ్చినా కూడా ప్రాణం లేకపోతే వేస్ట్ కదా.. మరి ఇప్పటికైనా శ్రీతేజ్ కళ్లు తెరుస్తాడేమో చూడాలి..

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా గురించి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత అట్లీ తో సినిమా చెయ్యనున్నాడు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×